సాయిచరితము-195
పల్లవి
మా దేవదేవ సాయి మహారాజా
కరుణించి కాపాడ కదిలిరావయ్యా
కష్టాలు కన్నీరు తొలిగిపోవునుగా
మా దేవదేవ సాయి మహారాజా
చరణం
బాధలే కలిగినా నీ బాట వదలము
నీ సాటి ఎవరు లేరు కద సాయి
కాలాలు వేచేను నీ చూపుకొరకు
హృదయాలు మురిసేను నిను చూడగానే
చరణం
పంచభూతాలు మోకరిల్లేను
పదునాల్గు లోకాలు పరవశించేను
దత్తావతారమై కదలి వచ్చావని
కలలన్ని మావి తీర్చుతావనుచు
చరణం
కోపాలు తాపాలు కోరికలు మమ్ము వేధించువేళ..బాధించు వేళ..
నీ స్మరణతోటి బయటపడ్డాము
నీడగా అండగా నువ్వున్నవేళ
కొత్తగా జగతి కనిపించెనయ్యా
చరణం
నీ పలుకు మాకు ప్రేమనే చిలుకు
నీ తలపు మాకు హాయినే నింపు
ఆనందవాటికై బతుకు సాగంగ
నీ చరిత మాకు సురగంగ సాయి
-సి.యస్.రాంబాబు
Chala bhagundhi 👌👌👌👌