మనోభావాలు దెబ్బతీయడం
మనసున్న మహారాణల కైనా
మహా రాజులకైనా భావాలు ఉండనే ఉంటాయి..
అలాంటి ఒక సున్నిత మైన మనసు నాకూ ఉంది..
ఆ మనసును నొప్పించి బాధ పెట్టే
మహానుభావులెందరో నా జీవితంలో! ఉన్నారు..
నాదేమెా సున్నిత మైన మనసు ఒకరిని నొప్పించను నన్ను నొప్పిస్తే
తట్టుకోలేను..
నొప్పింపక తానొవ్వక బ్రతుకుదామని చూస్తాను
చాలా వరకు అలాగే బ్రతికాను కూడా!
కానీ మా వారు పోయాక నా మనోభావాలను దెబ్బ తీసిన వారెందరో!
ఒక్క సారిగా తలక్రిందులైంది నా జీవితం..
ఆ షాక్ లోంచి తేరుకో లేక నీరసించి పోయా!
బ్రతకడమెలా అని భయపడ్డా!
కానీ నా పిల్లలే నాకు మనోధైర్యంగా నిలిచారు..
అందరినీ తలదన్నేలా బ్రతకడం నేర్పారు..
అంతే! మళ్లీ నా జీవితం నాకొచ్చింది..
దేన్నయినా ఎదుర్కునే శక్తి వచ్చింది..
దేవుడన్నీ చూస్తాడు తప్పు చేసే వాళ్లకు శిక్ష వేస్తాడు..
తప్పు చేయనప్పుడు భయపడే పని లేదు..
కాలమే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తుందంతే!!
-ఉమాదేవి ఎర్రం