దెబ్బతీయడం
మనోభావాలు దెబ్బ తీయకూడదు
మనం ఇతరుల యొక్క మనోభావాలను
ఎప్పుడూ దెబ్బతీయకూడదు.
మనందరికీ వాక్స్వాతంత్రం
ఉంది. అది రాజ్యాంగం మనకు
ఇచ్చిన హక్కు. అంతమాత్రాన
మనం ఇతరులను ఇబ్బందిపెట్టే వ్యాఖ్యలు
చేయకూడదు. అది చట్ట
విరుద్ధం. వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదు.
సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టింగులు
పెట్టకూడదు. అలా పోస్టింగులు
పెట్టి ఇతరుల మనోభావాలను
దెబ్బతీసే వారిపై చట్టరీత్యా
చర్యలు తీసుకోబడతాయని
పోలీసు వారు కూడా ప్రజలను
హెచ్చరిస్తున్నారు. సమాజంలో
ఉన్న వారంతా ప్రభుత్వం ఏర్పరచిన
నియమాలు పాటించవలసినదే. దానికి
ఎవరూ మినహాయింపు కాదు.
ఆ విషయం అందరికీ తెలుసు.
అయినా కూడా కొందరు
ఇతరుల మనోభావాలను
దెబ్బతీసే పనిలోనే ఉంటారు.
మనోభావాలు దెబ్బతిన్న
వ్యక్తి ఆవేశపడతాడు. అలా
ఆవేశపడి ఏదో ఒక అఘాయిత్యం చేసేస్తాడు.
ఆ చర్య సమాజానికి, ప్రజలకు
ఇబ్బందులు కలగజేస్తుంది.
ఒకవేళ తెలియకుండా
ఇతరుల మనోభావాలు దెబ్బతీసినట్లయితే వెంటనే
క్షమాపణ చెప్పి ఆ వివాదాన్ని
సద్దుమణిగేలా చేసుకోవాలి.
అలా చేయడంలోనే మన
వివేకం బయటపడుతుంది.
-వెంకట భానుప్రసాద్ చలసాని