రెక్కలు
కన్న తల్లిదండ్రులను మరచిపోకు
స్నేహితులను మరచిపోకు
అన్నదమ్ములను మరచిపోకు
అక్క చెల్లెళ్లను మరచిపోకు
కాలానికి నిలువుటద్దంగా ఉండు
మంచితనానికి మారుపేరుగా నిలబడు
ఉమ్మడి కుటుంబాలు ముక్కలు చేసుకునే రోజులు
వికలాంగులని విడిచిపెట్టిన రోజులు తెచ్చుకోకు
డబ్బులు వచ్చినాయని
హోదా పెరిగిందినే
రెక్కలు వేసుకుని
పారిపోకు మిత్రమా
పారిపోయి అందరినీ మరచిపోకు
మరచిపోయి కొత్త స్నేహాలు మొదలెట్టకు
మరచిపోయి కొత్త వ్యసనాలకు బానిసవ్వకు
మిత్రమా నేర్చుకో
మిత్రమా రెక్కలు తెచ్చుకో
ముడుచుకొని నడుచుకో
అది మనకే మేలు తెలుసుకో
– యడ్ల శ్రీనివాసరావు