ఓటు
ఈ రోజుల్లో డబ్బన్న వాళ్లే రాజకీయ నాయకుడవు తున్నారు..
సామాన్య మానవుల ఓటు హక్కును డబ్బు పెట్టి కొనేస్తున్నారు..
పేద ప్రజలు ఎవరు డబ్బులిస్తే ఆ డబ్బుకు ఆశపడి వాళ్లకే ఓటు వేస్తున్నారు..
వారి పేదరికాన్ని అలుసుగా తీసుకుని వీళ్లు రాజకీయాలకు వాడు కుంటున్నారు..
ఒకప్పుడు రాజ్యాలేలిన ప్రధాన మంత్రులైనా రాష్ట్రాలేలిన ముఖ్య మంత్రులైనా డబ్బు కోసం చూడక
ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వారు..
కానీ ఇప్పుడంతా డబ్బు మయం..
ఆ డబ్బుల కోసమే రాజకీయం! ఆ డబ్బులనే వెదజల్లడం..
ప్రజల్లో మార్పు వస్తేనే ఈ డబ్బుల రాజకీయం పోతుందేమెా!
రామరాజ్యం రావాలంటే ప్రజల్లో మార్పు రావలసిందే!!
-ఉమాదేవి ఎర్రం