సాయిచరితము-194

సాయిచరితము-194

పల్లవి
జీవితానికో అర్దం తెలిపెను సాయి
జీవితానికో గమ్యము చూపినవాడు/ ధైర్యమునిచ్చి తోడుగ నిలిచెను సాయి
కలల వంతెనకు బాటలు వేసిన వాడు

చరణం
బతుకు చిత్రమును మార్చినవాడు సాయి
బంధాలకు అర్థము చెప్పెను తాను
సకల జీవులకు అండగ నిలిచెడివాడు
సుఖశాంతులను కానుక చేసెడి వాడు

చరణం
రేపటి ఆశను మనలో నింపుతాడు/ నిన్నటి బాధకు లేపనమిచ్చెడివాడు
వర్తమానమును వెలుగుతో నింపుతాడు
మన బతుకు తోటను తీర్చిదిద్దును సాయి

చరణం
సాయినామమే తోడు ఉండగ
సాధ్యము కానిది లేదు
కష్టాలకు కన్ళీళ్ళకు చోటులేదు
సాయి ధ్యానము చేసితిమంటే మనము
చిక్కులు ఉచ్చులు దరికే రావులెండి

 

-సి.యస్.రాంబాబు

0 Replies to “సాయిచరితము-194”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *