గుండె
పాపం గుండెకు ..
ఎప్పుడూ గాయాలే..
ఆ గాయాలు తినీ తినీ..
బరువెక్కి పోతుంది..
బరువు మెాయలేనంటుంది..
ఎంత చెప్పినా వినదే..
ఈ మనసు..
గుండెకు కష్టం కలిగించకని..
మనసు మెాస్తుంది మాటను..
కానీ..
గుండె తట్టుకోవడం లేదు..
అప్పటికీ చెప్తూనె ఉన్నా..
మనసుకి చెప్తున్నా..
గుండెకేది చేరవేయకని..
మెున్న ఆగింది..
ఇప్పుడు కొట్టుకుంటుంది..
గుండె ఉన్న ప్రతి ఒక్కరు..
దానికి కావలసిన తిండే..
పెట్టండి..
గాయాలనసలే ..
తినిపిమచకండి..
గుండె బాగుంటేనే..
మనం బాగుంటాం!!
పాపం గుండె ఏదీ..
తట్టుకోవడం లేదు..
పరుల మాటలను..
పక్కన పెట్టండి
బరువెక్క నీయకండి..
జర భధ్రమండి..
జాగ్రత్తండోయ్!!
-ఉమాదేవి ఎర్రం