అంతర్లీనం
ప్రతి మనిషిలో దాగున్నది
ఓ మహోన్నతమైన కళ..
కానీ వెలికి తీసే ఊతమే కరువు..
బంధాలకూ బంధి అయ్యి జీవిత
నౌకలో ప్రయాణం చేసే
మర మనుషులు ఎందరో…
ఇక కళలకు తావు ఏది..
సాధనకు మార్గమేది..
ఓ పక్షి గూడు అల్లిక ఓ కళ..
కానీ ఆ పక్షికి ఆ గూడు
అవసరం నేర్పిన కళ…
ఇంతే మన జీవితం కూడా
అవసరం బయటకు తెస్తుంది
మనలో నీగూడమై ఉన్న కళలను…
అదే ఒక్కోసారి మన జీవనదారంమై
నిలిచి జీవనోపాధి కల్పించిన కళలు ఎన్నో..
మనము చేయాలిసింది
అలా శోధించాలి మనలో మనము..
మనలో కూడా ఏదో ఒక గొప్ప కళా
నిధి ఖచ్చితంగా ఉంటుంది
మనకు మనమే..
-కళ