బహుముఖ ప్రజ్ఞాశాలి
ఇంటి ఆవరణలోనే తల్లి చాటు బిడ్డగా పెరుగుతూ కన్నది తల్లి అయినా, తండ్రి పై మక్కువ ఎక్కువ పెంచుకుంటూ..
ముగ్గురు అన్నల ముద్దుల చెల్లెలి వై..!పెద్దన్న ఒళ్లో కూర్చునిగడియారంలోని ముళ్ళు తో సమయం చూస్తూ..
అన్నల ఆప్యాయత అనురాగాల ఒడిలో ఓనమాలు నేర్చుకుంటూఅమ్మ ప్రేమ నాకు మాత్రమే సొంతం కాకపాయనని తెలిసి తెలియని తనముతో తమ్ముడు వినాయక్తోవాదోపవాదాలతో చిలిపి అల్లర్లు చేస్తూ,
అలుగుతూ గిల్లుతూ అమ్మతో కోపంగా వాదిస్తూ అంతర్ముఖ మదనంతో నీ చుట్టూ పరిభ్రమించే జీవితాలను చూస్తూ పెళ్లి పై ద్వేషం పెంచుకొని ,
పెళ్లి అంటే ఒక పెంట అని ఇల్లు చొచ్చుకొని ఉన్నత సంబంధాలు వచ్చినా కానీ నిరాకరిస్తూ.. ఇంట్లో ఉండి పెద్ద చదువులు చదువుతూనీ లోపల దాగి ఉన్న
“అంతర్లీన అక్షర కళ”నెమ్మదిగా వెలుపలికి తీస్తూ..మోహనన్న ఇల్లాలివై
పుట్టింటికి మెట్టింటికి గౌరవాన్ని చేకూరుస్తూ..
సమాజంలో నీదంటూ ఒక్క సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని..
ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులను నీ అడుగుజాడలో నడిపిస్తూ
నిత్యం ఆరాట పోరాట గమనంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ
నీదైన సౌమ్య శైలితో
బహుముఖ ప్రజ్ఞాశాలివై
వెలుగొందుతున్నావు.
నీకు నీవే సాటిఎల్లప్పుడూ జయ విజయాలు ఇస్తూ .
ఆ చల్లని చూపుల తల్లి కృప నీపై ఉండి శ్వేతాంబరధరి పుస్తక ఆలయం లో సేద తీరుతుంటివి.
-బేతి మాధవి లత