వలస

వలస

సూరి వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. ఊర్లోనే గొర్రెలు, ఆవుల్ని కాస్తూ ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ అమ్మకి చెప్పకుండా పట్నం బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు.

“అత్త సూరి పట్నం వెళ్లే బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు నేను ఇప్పుడే చూశాను” అని చెప్పాడు పోతున్న. “అవున్రా పోతన్న… నాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు. ఏం సేద్దును రా దేవుడా ఎంత పని చేసాడు. వీడు నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు” అని బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయింది రామలక్ష్మి.

సూరి వాళ్ళ అక్క కైనా సుజాత వాళ్ళ ఇంటికి వెళ్లి “బావ నేను కూడా నీతో పాటు పనికొస్తాను. అమ్మని బాగా చూసుకుంటా అందుకే అమ్మకు చెప్పకుండా ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు.” “అలాగే లేరా కానీ ఈరోజు వద్దు రేపు వద్దువు సరేనా” అని చెప్పాడు నారాయణ.

“అలాగే బావ” “సరే రా నీకు అన్నం పెడతాను” అని సుజాత పిలిచింది. సుజాత ఇంటి పక్కన ఉన్న కుర్రాళ్ళు సినిమా షూటింగ్ లో పనిచేస్తున్నారు. “అక్క మా వాళ్లలో ఒకడు తక్కువ అయ్యాడు ఎవరైనా ఉంటే చెప్పవా” అని అడిగాడు సుబ్బు.

అలాగే రా సుబ్బు ఏదో గుర్తొచ్చింది దానిలాగా ఒక్క క్షణం ఆగు రా అని చెప్పి లోపలికి వెళ్ళింది సుజాత. “సూరి…. సూరి….. లేవరా….. అబ్బా ఏంటక్కా పక్కింటి కుర్రళ్లు సినిమా షూటింగ్లో పనిచేస్తారు వాళ్లలో ఇప్పుడు ఒక్కరు తక్కువ అయ్యారంట నువ్వు వెళ్తావా?” అని అడిగింది సుజాత.

“అలాగే అక్క నేను వెళ్తాను” అని చెప్పాడు సూరి “అయితే నాతో పాటు రా” అని చెప్పింది సుజాత. “రేయ్ సుబ్బు వీడు నా తమ్ముడు. ఊరు నుంచి ఇవాళ వచ్చాడు నీతో పాటు వస్తాడు అంట తీసుకొని వెళ్ళు” అని చెప్పింది సుజాత. “అలాగే అక్క మీరు నాతో రండి అని సూరిని రమ్మని చెప్పాడు సుబ్బు.”

షూటింగ్ దగ్గరికి వెళ్లడానికి వాళ్లకు బస్సు వచ్చింది ఆ బస్సులో ఎక్కి షూటింగ్ దగ్గరికి వెళ్లారు అక్కడ వాళ్ళకి ఒక డ్రెస్ ఇచ్చారు ఆ డ్రెస్ వేసుకొని టిఫిన్ పెట్టారు టిఫిన్ చేసిన తర్వాత చిన్న చిన్న పనులు ఉంటే చెయ్యమని చెప్పేరు. రాత్రి 11 వరకు అక్కడే ఉండి తర్వాత అదే బస్సులో ఇంటికి వచ్చేసారు. ఏ రోజు డబ్బులు ఆరోజు ఇచ్చేసేవారు.

“అక్క మీ తమ్ముడు నెలరోజులు పాటు మాతో వస్తే బాగుంటుందక్క” అని చెప్పాడు సుబ్బు. “ఏరా! సూరి వెళ్తావా నెలరోజులు అంట నేను అడిగింది సుజాత.” ” సరే అక్క వెళ్తాను అని చెప్పాడు సూరి.” నెలరోజుల తర్వాత నిద్రలేక రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాడు సూరి. తర్వాత వాళ్ళ బావతో కలిసి మేస్త్రి పనికి వెళ్లేవాడు. ఎక్కడ అతనికి రాని పనులన్నీ నేర్చుకొని 2 సంవత్సరం తర్వాత ఊరు వెళ్ళాడు సూరి.

“ఏరా! నాయన నీకు ఇక్కడ ఏ లోటూ తక్కువ అయింది. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు” నువ్వు అని ఏడుస్తూ రామలక్ష్మి అడిగింది. “ఏన్నాళ్ళని ఇక్కడ ఉంటాం అమ్మ, ఒక ఇల్లు తప్పించి ఏటి లేదు. పోనీ ఇక్కడ మనకి పొలం ఉందా? అందుకే నేను బ్రతుకు దారిని వెతుక్కుంటూ పట్నం వెళ్ళిపోయాను” అని చెప్పాడు సూరి.

సూరికి పెళ్లి చేసేసిన తర్వాత వాళ్లు పట్నం వెళ్లిపోయారు. ఇక్కడ రామలక్ష్మి ఒంటరిగా ఉండేది. పట్నం కి వలస వచ్చిన సూరి ఇక్కడే పని మేస్త్రి పనులు నేర్చుకొని తనకంటూ ఒక పేరుని సంపాదించుకున్నాడు. ఇక్కడ సొంతంగా ఒక ఇల్లు కట్టుకొని పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నారు.

ఊరు నుంచి పట్నానికి వలస వచ్చిన వాళ్ళు కొందరు సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొందరు అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. అలా ఎంతోమంది వలస వచ్చి ఉంటున్నారు. అందులో మేము కూడా ఉన్నాం.

⁠- మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *