హాయి… హాయిగా జీవితం
సొగసుగా నేల లో
వెళ్ళు నాటి
లేతకుపచ్చగా సాగి
నీలకాశంలో తూలి
శూన్యం లో నాట్యం చేస్తూ
ఊహల లోకం లో
ఉయ్యాలలూగుతూ
ఎగిరి కలవాలి
ఆశ తో ఎదురు చూస్తూ
తపస్సు చేశా తపన తో
ఎదురు చూసా
ఆకాశం నవ్వుతూందని
చిరు చిలక పలుకుల
వసంత వేళ…
ఒక్క సారి స్వర్గం లో
ఆ మధుర ఘడియ గడిచే…..
యవ్వనం విశ్వంలా కరిగింది…
ఐనా భయముందా….
నెలన వెళ్ళు నాటినా…
మనసు ఎగరడం ఆపిందా…
కళ్ళు తెరిచి చూసా
కాంతిని మొహం లా…
మాయే జీవితం లా..
శ్వాస నిశ్వాసనడిగింది
ఎక్కడిదాక పయనమని
దేర్యంగా చెప్పా
ప్రశాంత నందనానీకని…
పాల పుంతలు దాటి
దరికి చేరే…
దూరం కాని…
మనస్విని ఒడి లో కని
మానస సరోవరానీకని…
– అల్లాఉద్దీన్