ఎంప్లాయి

 ఎంప్లాయి

ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అతనికి వచ్చే జీతంలో ఇంటి అద్దె , కిరాణా షాప్ కి ఇవ్వాలి, కరెంట్ బిల్ , బైక్ ఇ.మ్.ఐ  కట్టాలి.

తల్లిదండ్రులకి డబ్బులు పంపించాలి. పిల్లలకు కావలసిన వస్తువులు కొని పెట్టాలి. ఇలా అనుకుంటూ పోతే ఇలా ఎన్నో ఖర్చులు ముడపడవచ్చు కొన్నిసార్లు మా నాన్న అనారోగ్యం కూడా కారణం కావచ్చు.
లాస్ట్ కి మిగిలి వేసుకోవడానికి డబ్బులు ఉండవు.

ఎంత ఉద్యోగం చేసిన సరే నా జీవితం వచ్చిన టైంలో వచ్చి మళ్లీ మన చేతిని ఖాళీగా ఉంచి వేరే వాళ్ళ చేతికి వెళ్లిపోతుంది.

మళ్లీ బాస్ చెప్పిన పని చేయకపోతే తిట్లు తినాల్సి వస్తుంది.  బయట ఉన్న ప్రజలు ఒకసారి ఆ సాఫ్ట్వేర్ ని చూసి వాడి ఏంటి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు.

డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు అని అంటారే గాని వాడి బాధ ఒక్కరు కూడా అర్థం చేసుకోరు.
ఇప్పుడు డబ్బులు సరిపోక ఎవరి దగ్గరికి అయినా వెళ్లి అప్పడిగితే ఏమ్మా ! మీ ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు.

బానే జీతం వస్తుంది కదా మళ్లీ అప్పు ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతారు. ఇలా ఇన్ డైరెక్ట్ గా మనల్ని అవమాన పరుస్తూనే ఉంటారు.

పొద్దుట నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో వర్క్ చేసి ఇంటికి వచ్చాక ఇంట్లో గొడవ జరిగితే ఆ మనిషికి ఏ మాత్రం ప్రశాంతంగా ఉంటుంది.

సాఫ్ట్‌వేర్‌ అనేది కూడా ఒక ‘సరుకు’. ఆ సరుకుని సాంకేతిక జ్ఞానంతో (టెక్నాలజీతో) తయారు చేస్తారు.
బతకనిచ్చిన ఉద్యోగ కొలువులో బానిసల బతుకుతున్నారు. జీవితం యాంత్రికంగా బతుకుతూ కొట్టుమిట్లాడుతున్నారు.

ఇప్పుడున్న సమాజంలో ఆడ, మగ అనే భేదం లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. ఆడవాళ్ళు అయితే ఇంటా బయట చూసుకొని వెళ్లాలి మగవాళ్ళు అయితే బయట చూసుకొని ఇంట్లో కూడా కొన్ని చూసుకుంటారు.

వాళ్లలో కొందరు ఉద్యోగిగా ఉండి బాధలు అవమానాలు ఎదుర్కొంటూ ఆ ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఒక సాధారణ ఎంప్లాయి ఎన్నైనా భరిస్తాడు అలాంటి వాళ్లలో మనం కూడా మనం కూడా ఉంటాం.

పేద కుటుంబంలో పుట్టి పెరిగిన ఉద్యోగం సంపాదించిన జీవితంలో కొంచెం వెనకేసుకుందామంటే అస్సలు మిగలనే మిగలదు.మన కొన్ని ఖర్చులు వదులుకోవాల్సి వస్తుంది.

ఒక ఎంప్లాయ్ గా ఎన్నో బాధలు పడినా కొన్ని అవమానాలను తట్టుకుంటూ జీవితాన్ని గడుపుతారు.
ఇటు ఫ్యామిలీని అటు తల్లిదండ్రులను చూసుకుంటూ ఉండటం అంటే చాలా కష్టం కానీ నెరవేరుస్తారు. కుటుంబ సభ్యుల నమ్మకని నిలబెట్టుకుంటారు.

 

-మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *