సీత కష్టాలు
సీత మామూలు గృహిణి..ఇద్దరు పిల్లలను కన్నది చేసుకున్నవాడు కొంచం మంచి వాడే అయినపిపటికీ సీత కష్టాలు సీతవే!
పెళ్లి అయేటప్పటికే డిగ్రీ చదివి బి ఇ డి చేసింది…జాబ్ చేస్తానంటె..రుక్మిణమ్మ గారు ( వాళ్ల అత్తగారావిడ ) మా ఇళ్లల్లోఆడవాళ్లు ఉధ్యోగాలు చేయరు చేయకూడదు అంది ఖారాకండిగా!దాంతో చేసుకున్న భర్త అమ్మ మాటవిని సీతను గీత దాటనివ్వ లేదు..
ఈ లోగా ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చేసారు చేయడానికికూడా వీలు లేకుండా!ఆ పిల్లలు కొద్దిగా పెద్ద అయ్యే సరికి ఖర్చులు తడిసి
మెాపెడు అవుతున్నాయా రాజు గారికి..
ఇంకేముంది?రోజూ పోరే! ఉధ్యోగం చేయమని ఎవరిస్తారు? ఆయనచేయమవ్నప్పుడు..గవర్నమెంట్ జాబ్ కు ఏజ్ బార్ అయిపోయిందిక..ప్రయివేట్ టీచరుగా జాయిన్ అయింది సీత..
అప్పుడా సీతకు ఒక రకం కష్టాలైతే ఇపఃపుడీ సీతకుమరో రకం కష్టాలు..ఇంట్లో పనులన్నీ చేసి పిల్లలను స్కూలుకు పంపి తను బాక్స్ సర్థుకుని ఆ బస్సులు ఎక్కుతూ దిగుతూ స్కూల్కి కొంచం లేటైతే!ఎలా టీచర్? మీరిలా అయితే?పిల్లలకు చెప్పాల్సిన మీరే ఇంత లేటుగా వస్తారా? అని
ప్రిన్సిపాల్ తో చివాట్లు..
సరే రేపటి నుండైనా కాస్త తొమదరగా వద్దామని ఒకేకూర చేసి రడీ అవుతే శ్రీవారితో చివాట్లు..నేను ఒక్క కూరతో ఎలా తింటాను? పప్పు ఎక్కడ? చారేది? నేను మనిషి ననుకుంటున్నావా? ఇంకేమైనాఅనుకుంటున్నావా? అని..
ఇవే ఇలా ఉంటే పిల్లలు అమ్మా! హోంవర్క్ చేయించట్లేదా? మీ అమ్మ..ఆవిడ కూడా టీచరేగా? మళ్లీమాతో చెప్పించుకుంటుంది? చూడు మార్కులెలా వస్తున్నాయిచదివించమను అంటుందమ్మా మా టీచరు అని వాళ్లగోల..
సీతకు ఏం చేయాలో అర్థం కాక..ఏమండీ పిల్లలకు కొంచం చదువు చెప్పం…డి..అని మాట పూర్తి కాకముందే!ఉధ్యోగం చేస్తున్నావని కళ్లు నెత్తి కెక్కాయే! నాకే పనిచెప్తావా? అని ఆయన రంకెలు..
సీత కష్టాలు సీతకే తెలుసిక ఈ గొడవలూ వద్దు ఈ ఉధ్యోగమూ వద్దు..మామూలు గృహిణి గానె బాగుందని రాజీనామా చేసింది..
అందుకే వెనుకటికి పెద్దలు అనేవాళ్లు ..ఎవరి పనులు వాళఃలు చేస్తేనె బాగుంటుందని..
ఆడవాళ్ల పని ఆడవాళ్లదే! మగవాళ్ల పని మగవాళ్లదే!ఉధ్యోగం పురుష లక్షణం అని…
-ఉమాదేవి ఎర్రం