మనస్పర్థలు
భార్యాభర్తల మధ్య ఏవిధమైన మనస్పర్థలు ఉండకూడదుఅని అందరూ కోరుకుంటారు.ముఖ్యంగా పిల్లలైతే తమతల్లిదండ్రులు కలసిమెలసి
ఉండాలని కోరుకుంటారు.
తల్లిదండ్రుల మధ్య ఎలాంటిగొడవ వచ్చినా పిల్లలు చాలాఅల్లాడిపోతారు. ఆ ప్రభావంవారి చదువుపై పడుతుంది.చదువుపై ఏకాగ్రత కుదరకవారికి తక్కువ మార్కులువస్తాయి.
పిల్లల భవిష్యత్తునాశనం అవుతుంది. వారుమానసిక ఆందోళనకు గురైఒకోసారి ఇంటి నుంచి కూడాపారిపోతారు.
మరికొందరు పిల్లలైతే ఆత్మహత్యలుకూడా చేసుకుంటున్నారు.భార్యాభర్తల నడుమ చిన్నమనస్పర్థలు రావటం చాలాసహజం.
ఆ మనస్పర్థలువచ్చినప్పుడు కూర్చునిమాట్లాడుకుంటే ఏదో ఒకపరిష్కారం దొరకకపోదు. అలాచేయకపోతే ఆ మనస్పర్థలుపెరిగిపోయి ఆ భార్యాభర్తలువిడిపోయే అవకాశం కూడాఉంది.
అప్పుడు నష్టపోయేదివారు మాత్రమే కాదు. వారిపిల్లలు కూడా. నేను టీచరుగా రోజూ చాలా మంది పిల్లలను గమనిస్తూ ఉంటాను.
కొందరుపిల్లలు రోజూ చాలా దిగులుగా ఉంటూ ఉంటారు. కొందరు తల్లిదండ్రులు తమ జీవిత భాగస్వామి మీద ఉండే కోపాన్ని తమ పిల్లలమీద చూపిస్తూ ఉంటారు.
అలాచేయటం పాపం అని తెలిసికూడా అలా చేస్తూనే ఉంటారు.ఏ తల్లిదండ్రులకైనా తన పిల్లలఎదుగుదలే ముఖ్యం. నిజంగాపిల్లలను ప్రేమించే తల్లిదండ్రులు తమలో తాము గొడవ పడరు.
-వెంకట భానుప్రసాద్ చలసాని