తిరుమల గీతావళి
పల్లవి
శ్రీహరి ధ్యానమే ప్రాణం మనకు
శ్రీహరి నామమే గానము చేసిన
బతుకే నిండును రాతేమారును
భారము తీరును ఇది నిజమండీ..
చరణం
నల్లని వాడు
నవ్వెడివాడు
సందడి చేసే
చిరునవ్వతడు
చరణం
గోవిందాయని పిలిచితిమంటే
కనురెప్పలపై నిలిచెడివాడు
శ్రీనివాసయని అన్నామంటే
ఆకలి ఉండదు అలసట ఉండదు
చరణం
తన దర్శనమే కలిగిననాడు
మనసుకు కలుగును ఎంతో హాయి
తన కోసముగా తపనలు మనవి
మనవి మావి వినవా దేవా
చరణం
నీ చింతనయే సర్వము మాకు
నీ చెంతుంటే అదియేచాలు
మా చేయన్నడు విడవకు స్వామీ
నీ నీడొకటే చాలును స్వామి
-సి.యస్.రాంబాబు