నేను అదుకుంటాను
మా ఇంటికి అప్పుడప్పుడు అనాధాశ్రమం నుండి మనుషులు వచ్చేవారు. వాళ్ళకి ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. వాళ్ళు ఎన్ని ఆధారాలు చూపించిన సారీ నేను ఇవ్వలేను అని చెప్పి పంపించడం నాకే ఏదోలా అనిపించేసేది.
అలాంటి టైం లో నా పుట్టినరోజు వచ్చింది. వాళ్ళ అనాధాశ్రమం ఎక్కడో అడ్రస్ తీసుకొనినాన్న రెండు రోజుల తర్వాత నా పుట్టిన రోజు. ఈ పుట్టినరోజుకి అనాధాశ్రమం పిల్లలకు భోజనం పెట్టాలనుకుంటున్నాను. నువ్వు ఒప్పుకుంటే భోజనం పెడదాం” అని నేను అడిగాను.
“అలాగే నేను ఎప్పుడూ నీ ఇష్టాన్ని కాదు అన్నానని” అని చెప్పారు నాన్న.నా పుట్టినరోజు అన్ని వంటలు తయారు చేసి అనాధాశ్రమానికి తీసుకు వెళ్ళాము. అక్కడ కేక్ కట్ చేసి ఆ పిల్లలకి అన్నం పెడుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఈ పుట్టినరోజు నాకు చాలా స్పెషల్ అనిపించింది.
మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగిన ఆ ఫంక్షన్ కి ఆ పిల్లలందరిని పిలిచేదాన్ని.మళ్లీ మళ్లీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే నేను అది మాటల్లో వర్ణించలేనిది.
రెండు సంవత్సరాలు తర్వాత నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది.
అది కూడా వాళ్లతోనే సెలబ్రేషన్ చేసుకొని నేను బెంగళూరు వెళ్ళిపోయాను.మా నాన్న హార్ట్ ఎటాక్ తో చనిపోయారని నేను ఇక్కడికి వచ్చాను. నా ఫ్యామిలీ చూడడానికి ఆసరాగా నేనే ఉన్నా.
ఇంట్లో వాళ్ళు కొంచం కోలుకున్నా తరువాత నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను.ఫ్యామిలీని చూస్తుకుంటూ జాబ్ చేస్తుకుంటున్నాను.
కొన్ని రోజులు తరువాత నేను ఆఫీస్ నుండి వస్తుండగా యాక్సిడెంట్ అయిందని తెలిసింది. ఎవరికి ఆక్సిడెంట్ అయిందని చూడడానికి వెళ్లాను. అక్కడ ఆక్సిడెంట్ అయిన అతన్ని చూసి షాక్ తిన్నాను. వెంటనే కోలుకొని శివరాం గారు లేవండి మీకు ఏమైంది అని కన్నీళ్లు పెడుతూ ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళ్ళాను.
“డాక్టర్ ఆయనకి ఎలా ఉంది?” అడిగాను.”సారీ చాలా సీరియస్ గా ఉంది అని చెప్పి మీరు వెళ్లి ఏదైనా ఉంటే మాట్లాడొచ్చు” అని చెప్పాడు డాక్టర్.
“అలాగే “అని చెప్పి”శివరాం గారు అసలు ఏం జరిగింది” అని అడిగాను.
“అమ్మా! మధు వర్షాలు కారణంగా అనాధాశ్రమం మొత్తం కూలిపోయింది అమ్మ. పిల్లలందరినీ తీసుకొని నా స్నేహితుడు స్కూల్లో ఉంటున్నాము. ఆ అనాధాశ్రమాన్ని కట్టడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు.
పిల్లలకు ఒక పూట భోజనం పెడితే మరో పూట పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. నిన్ను కలవడానికి మీ ఇంటికే వస్తుంటే నాకు ఇలా యాక్సిడెంట్ అయింది” అమ్మ అని చెప్పాడు.
“ఇంత జరిగితే ఒకసారి కూడా నాకు ఎందుకు కాల్ చేసి చెప్పలేదు” అని అడిగాను.”అది కాదమ్మా! నువ్వు ఉద్యోగం వచ్చిందని బెంగళూరు వెళ్ళిపోయావు కదా అందుకే నీకు చెప్పలేకపోయాను” అని చెప్పాడు శివరాం.
“ఇకనుంచి వాళ్ళం చూసుకున్న బాధ్యత నాది” నేను శివరాం గారికి మాట ఇచ్చాను.ఆయన ఆనందంతో చనిపోయారు.
ఆయన అంత్యక్రియలు పూర్తి చేసి పిల్లల్ని నాతో పాటు ఇంటికి తీసుకెళ్ళాను.
ఏంటి పిల్లలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఏంటి మధు ఇది పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చావు అని అడిగింది అమ్మ.నేను జరిగిన విషయం చెప్పాను. పిల్లలు మన ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది అమ్మ. ఎంత చెప్పినా నా మాట వినలేదు.
నా ఫ్రెండ్స్ శ్రావణి అనాధాశ్రమంలో పనిచేస్తూ ఉండేది. ఇంట్లో వాళ్ళు నా మాట వినడం లేదని తప్పని పరిస్థితిలో పిల్లల్ని మా ఫ్రెండ్ శ్రావణి పని చేసే అనాధశ్రమంలో జాయిన్ చేశాను.
నా జీతంలో సగం డబ్బులు ఇంటికి ఇస్తూ మరో సగం డబ్బులు బ్యాంకులో దాచేదాన్ని. అలా సంవత్సరం పాటు దాచిన డబ్బులతో కూలిపోయిన అనాధాశ్రమం కట్టించాను.
ఈ ఆశ్రమం కి శివరాం గారి పేరు పెట్టి ఈ ఆశ్రమం బాధ్యతలు శ్రావణికి అప్పచెప్పారు.నేను సహాయం చేస్తున్నట్టుగా ఎవరికి తెలియకూడదు అని శ్రావణి కి చెప్పాను.
కావ్య పేరుతో అనాధాశ్రమానికి సహాయం చేయడం మొదలు పెట్టాను నేను.నా పేరుతో చేయకపోయినా మరో పేరు పెట్టుకొని ఆ పిల్లలకి సహాయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది.
ఈ విషయం తెలిసిన మా తమ్ముడు ఇంట్లో గొడవ గొడవ చేశాడు. దానికి సంజాయిషి చెప్పమని నన్ను అడిగింది అమ్మ.పిల్లల్ని నేను ఆదుకుంటానని శివరాం గారికి మాట ఇచ్చాను. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నాను. అందుకే ఆ పిల్లల్ని ఎప్పటికీ నేను ఆదుకుంటాను.
నా పేరుతో కాకుండా మరో పేరుతో సహాయం చేస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాను.కాసేపయ్యాక ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ప్రోత్సహించారు.
సహాయం చేయడానికి పేరు అవసరం లేదు అని నా అభిప్రాయం.
- మాధవి కాళ్ల