సాయిచరితము 190
పల్లవి
సాయినాధుని దర్శనమే
మనసుకు ఎంతో ఇష్టముగా
సాయినామమే పలికితిమా
కష్టాలన్నీ తీరునుగా
చరణం
కలలను ఎన్నో కంటామూ
తీర్చేభారము తనదనునూ
వెతలే మనలను బాధిస్తే
కాపాడేందుకు వచ్చునుగా
చరణం
నీడే మనకు లోపిస్తే
నీడే తానుగ మారునుగా
గమ్యము లేని పయనములో
గమ్యము తానై నడుపునుగా
చరణం
బంధాలన్నీ భయపెడితే
అభయహస్తమే ఇచ్చునుగా
బాధ్యతలన్నీ భారము కాగా
అండగ నిలుచును సాయొకడే
చరణం
సద్గురు బాటలో నడిచితిమా
భయమును వీడి కదిలెదమూ
సాయి చరితమూ చదివితిమా
ప్రేమను పంచుట తెలియునుగా
-సి.యస్.రాంబాబు