ఆవేశం
“రేయ్ రవి ఈ వీకెండ్ మనము అందరం కలిసి బయటికి వెళ్దాం” అని చెప్పాడు రాఘవ.
“మనం ప్రతిసారి బయటకు వెళ్తున్నాము కదరా ఈ వీకెండ్ ఏంటి స్పెషల్?” అని అడిగాడు రవీంద్ర.
“ఇప్పుడు కాదు మనం బయటికి వెళ్లిన రోజు చెప్తాను” అని చెప్పాడు రాఘవ.
“సరేలే నీ ఇష్టం” పద ఆఫీస్ కి వెళదాం అని చెప్పాడు రవీంద్ర.
రవీంద్ర , రాఘవ ఇద్దరు చదువుకున్న రోజుల్లో నుంచి మంచి ఫ్రెండ్స్. ఓకే ఆఫీసులో ఉద్యోగం చేయడం ఇద్దరి ఇల్లులు పక్కపక్కనే ఉండడం అలా వీళ్ళ స్నేహం రోజురోజుకీ పెరిగింది.
రాఘవకి ఒక కొడుకున్నాడు. రవీంద్ర కి ఇద్దరు కూతుర్లు. పెద్ద అమ్మాయికి పెళ్లి అయిపోయింది ఆమె బెంగుళూరులో ఉంటున్నారు. ఇంకా చిన్న అమ్మాయి చదువుకుంటుంది.
“సాక్షి మనం ఈ వీకెండ్ బయటికి వెళ్తున్నాం కదా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను” అని చెప్పాడు ఆదిత్య.
“అవునా ఏంటది?” అని అడిగింది సాక్షి.
“ఇప్పుడు కాదు ఆ రోజు చెప్తాను” అని చెప్పి వెళ్ళిపోయాడు ఆదిత్య.
సాక్షి , ఆదిత్య ఓకే కాలేజీలో చదువుకుంటున్నారు.
“నాన్న ఈ వీకెండ్ మనం బయటకు వెళ్తున్నాను కదా ఆదిత్య నాకు ఏదో చెప్పాలని చెప్పాడు. అంకుల్ మీకు ఏమైనా చెప్పారా నాన్న” అని అడిగింది సాక్షి.
” ఈ వీకెండ్ బయటికి వెళ్తున్నాము అని చెప్పాడు కానీ స్పెషల్ ఏంటి అని అడిగితే మాత్రం చెప్పలేదు” అని చెప్పాడు రవీంద్ర.
“అవునా” అని ఆలోచిస్తూ వెళ్ళిపోయింది తను రూమ్ లోకి సాక్షి.
“హలో సాక్షి ఏం చేస్తున్నావ్?” అని అడిగాడు ఆదిత్య.
“ఇప్పుడే డిన్నర్ చేసి రూమ్ లో ఉన్నాను ఈ టైంలో కాల్ చేసావ్ ఏంటి?” అని అడిగింది సాక్షి.
“అది ఏం లేదు రేపు మనం బయటకు వెళ్తున్నాము కదా నువ్వు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకో బాగుంటుంది” అని చెప్పాడు ఆదిత్య.
“నాకు గ్రీన్ కలర్ అంటే ఇష్టం ఉండదు అని నీకు తెలుసు కదా ఆదిత్య” అని చెప్పింది సాక్షి.
“అవును నాకు తెలుసు అందుకే లైట్ గ్రీన్ డ్రెస్ వేసుకో” అని చెప్పాడు ఆదిత్య.
“నా దగ్గర కలర్ డ్రెస్ లేదు” అని చెప్పింది సాక్షి కొంచెం కోపంగా.
“నీకెందుకు ఊరికే కోపం వస్తుంది సరే నీ ఇష్టం వచ్చినట్టు వేసుకో” అని చెప్పి కాల్ కట్ చేశాడు ఆదిత్య.
రాఘవ , రవీంద్ర ,ఆదిత్య లు సోఫాలో కూర్చుని ఇంకా ఎంతసేపు రెడీ అవుతారు మీరు. టైం అయిపోతుంది త్వరగా రెడీ అవ్వండి అని కోపంతో అన్నాడు రవీంద్ర.
“అబ్బా ఉండండి అయిపోయింది వచ్చేస్తున్నాము” అని చెప్పింది మృదుల.
“ఏమ్మా సాక్షి నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోయి లేట్ చేస్తున్నావా?” అని అడిగాడు రవీంద్ర.
“నేను ఎప్పుడో రెడీ నాన్న వాళ్లే లేట్ చేస్తున్నారు” అని చెప్పింది సాక్షి.
సాక్షి డ్రెస్ చూసి ఆదిత్య ఫిదా అయిపోయాడు. ఏదో తనని కొత్తగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం సేపు తనంతాను మర్చిపోయాడు.
మేము రెడీ పదండి వెళ్దాం అని చెప్పి వచ్చారు సరయు , మృదుల.
ఆది…… రేయ్ ఆది…. అని భుజం భుజం మీద తడుతూ
“నువ్వు వెళ్ళి కార్ తీయ్ మేము వస్తున్నాం” అని చెప్పాడు రాఘవ.
“సరే నాన్న” అని చెప్పి కార్ తీయడానికి వెళ్ళాడు ఆదిత్య.
“మేము నలుగురం కారులో వెళ్దాం నువ్వు సాక్షి బైక్ మీద వచ్చేయండి” అని చెప్పాడు రాఘవ.
“సరేనాన్న మీరు వెళ్తూ ఉండండి మేము వెనకాలే వస్తాం” అని చెప్పాడు ఆదిత్య.
వాళ్లు కారుకి వెళ్లిపోయారు.
“సాక్షి ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు” అని చెప్పాడు ఆదిత్య.
కొంచెం సిగ్గుపడుతూ” థాంక్యూ ఆదిత్య. నువ్వు నాకు ఏదో చెప్పాలని అన్నావ్ ఏంటది?” అని అడిగింది సాక్షి.
“హాయ్ ఆది ఎలా ఉన్నావ్? ఎక్కడికి వెళ్తున్నావు?” అని వచ్చి అడిగింది గీతిక.
“ఫ్యామిలీ మెంబర్స్ తో బయటికి వెళుతున్నాం” అని చెప్పాడు ఆదిత్య.
మిగతా వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదు. ఆది ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు” అని చెప్పి హగ్ చేసుకుంది గీతిక.
థాంక్యూ వాళ్లు వెళ్లిపోయారు నేను సాక్షి వెళ్ళాలి అని చెప్పాడు ఆదిత్య.
‘ఆదిత్య డ్రెస్ బావుంటే నీకెందుకే వాడ్ని కౌగిలించుకోవడం అవసరమా అని కోపంతో మండిపోతుంది సాక్షి.’
“గీతిక మాకు టైం అవుతుంది మేము వెళ్తాము. పద ఆదిత్య వాళ్లు మన కోసం వెయిట్ చేస్తారు” అని చెప్పింది సాక్షి కొంచెం నవ్వుతూ.
“ఓకే బాయ్ గీతిక” అని చెప్పాడు ఆదిత్య.
‘తనకి బాయ్ చెప్పడం అవసరమా అని మనసులో తిట్టుకుంది. ఈ గీతికకి ఏం పని లేదు అనుకుంటా. ఎప్పుడు ఆదిత్య చుట్టే తిరుగుతుంది అని అనుకుంటుంది సాక్షి.’
రాఘవ ఇంటి ఎదురుగా ఉన్న సురేంద్ర కూతురు ఈ గీతిక. సురేంద్ర , రాఘవ , రవీంద్ర వీళ్ళ ముగ్గురు ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు.
వీరిద్దరిని విడదీయాలని రాఘవ కొడుకుకి తన కూతురినిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు. గీతిక కూడా ఎప్పుడు ఆదిత్య చుట్టే తిరుగుతుంది.
దారిలో వెళ్తుండగా ఒక పార్క్ కనిపించింది. అక్కడ బైక్ ఆపి , “
ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను” అని చెప్పి పక్కకు వెళ్ళాడు ఆదిత్య.
సాక్షికి ఇష్టమైన చాక్లెట్ రోజ్ ఫ్లవర్ తీసుకొని వచ్చి “నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?” అని మోకాళ్ళ మీద కూర్చొని అడిగాడు ఆదిత్య.
సాక్షి ఫోన్ రింగ్ అయింది “ఇంకా ఎక్కడున్నారమ్మ త్వరగా రండి మీ కోసం వెయిట్ చేస్తున్నాను” అని చెప్పాడు రవీంద్ర.
“హా వస్తున్నాం. దగ్గర్లోనే ఉన్నాం జస్ట్ ఫైవ్ మినిట్స్” అని చెప్పి కాల్ కట్ చేసింది సాక్షి.
“నాన్న వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు మనం వెళ్దాం పద” అని చెప్పింది సాక్షి.
“తన సమాధానం కోసం ఎదురుచూస్తున్న ఆదిత్యను చూసి పద వెళదాం. ఏంటి అలా చూస్తున్నావ్” అని కంగారుగా అడిగింది సాక్షి.
సరే… పద అని బైక్ స్టార్ట్ చేశాడు ఆదిత్య.
సరదాగా కబుర్లు చెప్పుకొని లంచ్ చేశారు. కొన్ని ప్లేసెస్ చూడటానికి కూడా వెళ్లి నైట్ డిన్నర్ కూడా చేసేసి ఇంటికి వెళ్ళిపోయారు.
“సాక్షి నేను పొద్దున్న చెప్పిందానికి నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను ఇప్పుడైనా చెప్పవా” అని అడిగాడు ఆదిత్య.
“నువ్వు అడిగిన దానికి సమాధానం రేపు చెప్తా” అని చెప్పేసి వెళ్లిపోయింది సాక్షి.
గీతిక బయటకు వచ్చి వాళ్ళని చూసి ఆగిపోయి ఉంది. ‘ఆదిత్య ఏం చెప్పాడో, సాక్షి ఏం సమాధానం చెప్పాలనుకుంది అని అనుకుంది గీతిక. చూద్దాం కాలేజీలో ఏం చెప్పాలనుకున్న అలా అనుకోని లోపలికి వెళ్ళిపోయింది.’
కాలేజీలో ఆదిత్య సాక్షి కోసం వెయిట్ చేస్తున్నాడు.
“ఏంటి సాక్షి ఇంత లేటా నీకోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను” అని చెప్పాడు ఆదిత్య
“సారీ కొంచెం లేట్ అయింది ట్రాఫిక్ వల్ల అని చెప్పింది. మా నాన్నకి అల్లుడు నువ్వే అయితే నాకు మొగుడివి కూడా నువ్వే” అని చెప్పి వెళ్ళిపోయింది సాక్షి.
ఆదిత్య కి అర్థం కాక “హా ఏంటో” అని ఆలోచిస్తూ అక్కడ కూర్చుండిపోయాడు.
సాక్షి చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ “
“హా అర్థమైంది “అని అనుకొని సాక్షి దగ్గరికి వెళ్ళాడు.
“మీ నాన్నకి నేను అల్లుడినే అయ్యి నీకు మొగుడిని అవుతాను” అని చెప్పాడు ఆదిత్య.
వీళ్ళ మాటలు విన్న గీతిక వెంటనే సురేంద్ర కి ఫోన్ చేసి “సాక్షి ఆదిత్య ప్రేమించుకుంటున్నారు అని చెప్పింది. మరి ఆదిత్యని నాకు ఇచ్చి పెళ్లి ఎలా చేస్తారు” అని అడిగింది గీతిక.
“అది నేను చూసుకుంటాను వెయిట్ అండ్ సి” అని చెప్పాడు సురేంద్ర.
రవీంద్ర పెద్ద కూతురు సహస్రని , సురేంద్ర కొడుకు విశాల్ ప్రేమించాడు. ఎంత వెంటపడినప్పుడు సహస్ర విశాల్ ప్రేమను కాదనే చెప్పింది దాంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుటుంబం వల్లే తన కొడుకు చనిపోయాడని పగ పెంచుకున్నాడు సురేంద్ర. రాఘవ రవీంద్రలను విడదీయాలి అనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ అన్ని ఫెయిల్ అయ్యాయి.
చెప్పులు మాటలు చెప్తే వినేరకం కాదు వీళ్ళిద్దరూ. “మన ప్రేమ విషయం వెంటనే ఇంట్లో వాళ్లకి చెప్పేయాలి “అని చెప్పింది సాక్షి.
“నువ్వు చెప్పింది కూడా కరెక్టే కానీ మనం టూర్ వెళ్లి వచ్చిన తర్వాత చెప్పుదాం” అని చెప్పాడు ఆదిత్య
“సరే “అని చెప్పింది సాక్షి
నెక్స్ట్ టూర్ కి వెళ్ళడానికి అని లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నారు.
టూర్ కి బస్సులో బయలుదేరారు. అక్కడ ఒక హోటల్లో దిగారు. హోటల్ మొత్తం చూస్తూ స్విమ్మింగ్ ఫూల్ దగ్గరికి వెళ్ళింది సాక్షి. తన వెనకాల గీతిక కూడా వెళ్ళింది. అది ఎవరు గమనించలేదు.
ఎవరు చూడకుండా చూసి సాక్షిని స్విమ్మింగ్ పూల్ లోకి తోసేసి వెళ్ళిపోయింది గీతిక.
ఆదిత్య సాక్షిని వెతుక్కుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి చూస్తే సాక్షి నీళ్లలో కొట్టుకుంటూ కనిపించే సారికి కంగారుగా వెంటనే వెళ్లి కాపాడాడు ఆదిత్య.
కాసేపు తర్వాత స్పృహలోకి వచ్చి “నన్ను ఎవరో వెనకనుంచి తోసారు” అని చెప్పింది సాక్షి.
“అది విన్న నీ వెనుక ఎవరు లేరు కదా” అని చెప్పాడు ఆదిత్య.
“సాక్షి నువ్వు రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను” అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు ఆదిత్య.
స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్లి అక్కడ సీసీ కెమెరా ఉందేమో అని చూస్తున్నాడు అక్కడ లేదు అనేసరికి నిరాశకు గురయ్యాడు.
రాఘవ నీకు ఎలాగో లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు. గీతిక మీ ఆదిత్యని ప్రేమిస్తుంది నువ్వు ఒప్పుకుంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అని చెప్పాడు సురేంద్ర.
మేము ఆలోచించుకొని చెప్తాం అన్నాడు రాఘవ.
ఎలా ఉన్నారు అంకుల్? అని సహస్ర వచ్చి అడిగింది.
మేం బాగానే ఉన్నాం అమ్మ. ఎప్పుడొచ్చావ్ ఎన్ని నెలలు అని అడిగింది సరయు.
ఐదవ నెల అంటే అని చెప్పింది సహస్ర.
టూర్ లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి గీతికని ఇష్టపడ్డాడు. ఆ అబ్బాయి ప్రపోజ్ చేస్తే కూడా రిజెక్ట్ చేసింది గీతిక.
ఒకరోజు సాక్షి ఆదిత్య గుడికి వెళ్లారు. అక్కడ పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లి చూడ్డానికి వెళ్తే కొన్ని కారణాల వల్ల సాక్షి మేడలో తాళి కట్టేసాడు ఆదిత్య.
అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ సాక్షి షాక్ అయ్యారు.
సాక్షి ఏడ్చుకుంటూ హోటల్ కి వెళ్ళిపోయింది. ఎంత బతిమిలాడినా కూడా అసలు మాట్లాడట్లేదు.
స్విమ్మింగ్ పూల్ దగ్గర సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల వేరే సీసీ కెమెరా ఫుటేజ్ ను చూస్తే సాక్షి వెనక గీతిక వెళ్లడం దాంట్లో రికార్డయింది.
గీతిక దగ్గరికి వెళ్లి అడిగితే తను అసలు నిజం చెప్పకుండా అబద్ధం చెప్పచ్చు ఏమో అని తనతో రెండు రోజులు క్లోజ్ గా ఉన్నట్టు నటించాడు ఆదిత్య.
అది చూసిన సాక్షి కూడా ఇంకా ఆదిత్య మీద కోపం పెట్టుకుంది.
ఆదిత్య రెండు రోజులు క్లోజ్ గా ఉండేసరికి అసలు నిజం చెప్పేసింది. దాంతో ఆదిత్య చాలా కోప్పడి ఈ నిజం తెలుసుకోవడానికి నీతో చనువుగా ఉన్నట్టు నటించాను అని చెప్పాడు. నువ్వు నన్ను ఎలా పెళ్లి చేసుకోవో నేను చూస్తాను అని ఛాలెంజ్ చేసింది గీతిక. గీతికని ప్రేమించిన అబ్బాయి తో మాట్లాడే నువ్వే ఎలాగోలా తాళికట్టు అని చెప్పి ప్లాన్ చెప్పాడు ఆదిత్య.
ఆ ప్లాన్ ప్రకారం గీతికకు ఆ అబ్బాయికి పెళ్లి అయిపోయింది.
“జరిగిందంతా చెప్పి సాక్షికి తన మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని తుడిచేసాడు ఆదిత్య.”
“నన్ను క్షమించు. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను” అని బాధపడింది సాక్షి.
టూర్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చారు.
“నన్ను క్షమించు నాన్న కొన్ని కారణాల వల్ల ఇతను నా మెడలో తాళి కట్టవలసి వచ్చింది అని బాధతో చెప్పింది. ఇతనే మీ అల్లుడు” అని చెప్పింది గీతిక.
సురేంద్ర కోపంతో రగిలిపోతూ గీతికని కొట్టాడు. “మావయ్య గారు ఇప్పుడు గీతిక మీ కూతురే కాదు నాకు భార్య కూడా అది గుర్తుపెట్టుకోండి” అని చెప్పాడు కిరణ్.
“ఎవర్రా నీకు మావయ్య నా కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు. నీకు ఎంత డబ్బు కావాలంట అంత డబ్బు ఇస్తాను. తనని వదిలేసి వెళ్ళిపో” అని కోపంతో చెప్పాడు సురేంద్ర.
“మీ నాన్న ఒప్పుకోకపోతే ఏంటి? మా వాళ్ళు ఒప్పుకున్నారు పద అక్కడికే తీసుకెళ్తాను నిన్ను అని చెప్పాడు కిరణ్.”
“నేను కూడా మొదట కిరణ్ అపార్థం చేసుకున్నాను నాన్న నా మీద ఎంతో ప్రేమ ఉందని తెలుసుకున్నాక పెళ్లి చేసుకున్న కూడా తనని అంగీకరించాను” అని చెప్పేసి వెళ్ళిపోతుంది గీతిక.
కిరణ్ మీద పగతో రగిలిపోయి తనను చంపేయాలని ప్లాన్ వేశాడు.
కిరణ్ కుటుంబం గీతికని తన కన్న కూతురులా చూసుకుంటున్నారు. అమ్మ లేని లోటు తీరిపోయింది.
కిరణ్ నువ్వు నన్ను ఎందుకు ప్రేమించవో తెలీదు కానీ నీ ప్రేమని , నిన్ను కాదు అన్నాను కానీ నాకు అమ్మ లాంటి అత్తయ్యనిచ్చినందుకు నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన తక్కువే” అని చెప్పింది గీతిక.
” నీలాంటి భార్య నాకు దొరకడమే అదృష్టం” అని చెప్పాడు కిరణ్.
ఒకరోజు గీతిక , కిరణ్ రాఘవ వాళ్ళ ఇంటికి వచ్చారు.
రవీంద్ర , రాఘవలు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. అంకుల్ మీకొక విషయం చెప్పాలి అని చెప్పింది.
ఏంటి గీతిక చెప్పు అని అడిగింది మృదుల.
“అది ఆదిత్య , సాక్షి ప్రేమించుకున్నారు. ఈ విషయం మీకు చెప్పారో లేదో నాకు తెలియదు. వాళ్ల వల్లే నాకు ఇంత మంచి భర్త దొరికాడు. అందుకే ఇది మనసులో దాచుకోలేక మీ ముందు చెప్తున్నాను” అని చెప్పింది గీతిక.
గీతిక , కిరణ్ వచ్చినప్పుడు ఆదిత్య , సాక్షి ఇంట్లో లేరు బయటికి వెళ్లారు.
గీతికాను కూడా కూతురు లాగా చూసుకుని కిరణ్ కి కావలసిన మర్యాదలు చేసి పంపించారు.
ఇది చూసిన సురేంద్ర కోపం నుండి పగ పెంచుకున్నాడు. కిరణ్ ని ఎలాగైనా చంపేయాలి అనుకున్నాడు. అలాగే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక ఒక నిర్ణయం తీసుకున్నాడు సురేంద్ర.
కిరణ్ వాళ్ళ ఇంటికి సురేంద్ర వెళ్లాడు.
“మిమ్మల్ని అవమానించి పంపించినందుకు నన్ను క్షమించండి. నేను మారిపోయాను ఇంక నా కూతురికి నేను దూరంగా ఉండలేను” అని మాయమాటలు చెప్పాడు సురేంద్ర.
సురేంద్ర మాటలను అందరూ నమ్మేశారు. కానీ గీతికకి మాత్రం ఏదో మూల అనుమానం మాత్రమే మిగిలిపోయింది.
అనుమానం వచ్చి ఒక కంట కనిపెడుతూనే ఉంది సురేంద్ర ని.
అన్నంలో విషయం కలిపితే అది గీతిక , సురేందర్ కి రివర్స్ కొట్టింది.
ఒకరోజు కిరణ్ ఆఫీస్ కి వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది కానీ చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాడు.
ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అవ్వడం వల్ల ఈసారి పెద్ద ప్లాన్ వేయాలని ఆలోచించాడు.
ఇంకా గీతిక ఓపిక పట్టలేక సురేందర్ దగ్గరికి ఒంటరిగా వెళ్లి
“మా మీద అసలు కోపం ఎందుకు నాన్న. మేమేం తప్పు చేశాను. కిరణ్ ని ఎందుకు చంపాలని చూస్తున్నారు.
నేను కన్న కూతురాన్ని మర్చిపోయారా. ఎందుకు మీకు కిరణ్ ఇష్టం లేకపోతే మాట్లాడటం మానేయండి అంతేగాని చంపే అంత ఆవేశం పెంచుకోవడం ఎందుకు నాన్న.
మనకి ఎవరి మీద ప్రేమ ఉంటుందో వాళ్ల మీద కోపం వస్తుంది అంటారు. కోపం ఎంత సేపు ఉండదు అది కాసేపు మాత్రమే.
కోపంతో పాటు ఆవేశాన్ని పగగా మార్చుకున్నారు.
మీకు మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నారు ఈ పగలు పెంచుకొని ఈ వయసులో ఏం సాధిస్తారు నాన్న. కిరణ్ ని చంపేస్తే మీరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత నాకు ఎవ్వరూ ఉండరు ఒంటరిగా మిగిలిపోతాను అని ఒక్కసారి కూడా ఆలోచించారా మీరు? అని ఏడుస్తూ అడిగింది.
ఇలా చిన్నచిన్న వాటికే చంపుకోడాలు , నరుక్కోడాలు చేస్తే మనతో సంబంధం ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతాను నాన్న. తర్వాత నీ బాధను పంచుకోవడానికి కూడా ఎవ్వరూ నీ పక్కన ఉండరు.
అది గుర్తుపెట్టుకో నాన్న అని చెప్పి వెళ్ళిపోయింది గీతిక.
సురేంద్ర సోఫాలో కుప్పకూలిపోయాడు. గీతిక చెప్పిన చెప్పిన మాటలను గుర్తు చేస్తుకుంటూ ఆలోచిస్తున్నాడు.
ఒక గంట తర్వాత “నేను చేసినవన్నీ తప్పులే నన్ను క్షమించండి” అని రాఘవ , రవీంద్ర వాళ్ళ దగ్గరికి వెళ్లి క్షమాపణలు చెప్పాడు సురేంద్ర.
“ఇప్పుడు నువ్వు ఏం తప్పు చేసావ్ క్షమించు అని అడుగుతున్నావు” అని రాఘవ అడిగాడు.
మీ ఇద్దరిని విడదీయాలనుకున్నాను. మీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాను. కానీ నా కూతురు తన మాటలతో నన్ను మార్చేసింది. కిరణ్ ని చంపాలనుకున్నాను అంతకన్నా ఎన్నో తప్పులు చేశాను అని ఎంతో బాధపడ్డాడు సురేంద్ర.
గీతిక దగ్గరికి వెళ్లి క్షమాపణలు చెప్పిన గీతిక అసలు నమ్మలేదు.
రవీంద్ర రాఘవ పక్కన కూర్చొని ఆదిత్య, సాక్షిలను పిలిచి మీ ప్రేమ విషయం మాకు తెలిసింది. మీకు పెళ్లి చేయడం నాకు ఇష్టమే అని చెప్పారు ఇద్దరు.
సురేంద్ర కూడా వాళ్లతో కలిసిపోయి ఆనందంగా ఉన్నాడు.
ఆదిత్య సాక్షిలా పెళ్లి రంగ రంగ వైభవంగా జరిగింది.
కోపం ఒక స్టేజ్ లోనే ఉంటుంది కోపం తర్వాత ఆవేశం పెరుగుతుంది దాని తర్వాత పగగా మారుతుంది. కోపంలో కానీ ఆవేశంలో కానీ ఏ నిర్ణయం తీసుకోవద్దు. అలా తీసుకోవడం వల్ల మనం నేరస్తులం అయిపోతాం. ప్రాణం బెల్ తీసుకున్న వాలం కూడా అవుతాం ఒక ప్రాణం బలి తీసుకునే వాళ్ళం అవుతాం అందుకే కోపం వచ్చినప్పుడు కాసేపు తర్వాత ఆలోచిస్తే మనకే మంచిది.
-మాధవి కాళ్ల