కోపం ఎందుకు వస్తుంది

కోపం ఎందుకు వస్తుంది

అవును నిజమే కోపం ఎందుకు వస్తుంది అంటే సరియైన కారణం లేదు. కానీ కొన్ని కారణాల వల్ల వస్తుందని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. అదేంటో మీకు ఇప్పుడు చెప్తాను.అవి సైరైనవా కావా అనేది మీరు ఆలోచించండి.
1. ఇంట్లో ఎవరికైనా చెప్పిన పని సరిగ్గా చేయక పోతే కోపం వస్తుంది.
2. మనం మన పనులు సరైన సమయం లో చేయనప్పుడు కోపం వస్తుంది.
3. ఆఫీస్ లో బాస్ మన పని ఎంత చేసినా వేరే వాళ్ళని మెచ్చుకుంటూ మనల్ని తక్కువ చేస్తే కోపం వస్తుంది.
4. ఎంత పని చేసినా ప్రమోషన్ రాకపోతే కోపం వస్తుంది.
5. ఆకలి అయితే కూడా కోపం వస్తుంది. ఆ కోపం లో ఎంత తింటున్నమో తెలియకుండా తినేస్తూ ఉంటాం.
6. పిల్లలు మాట విననప్పుడు కోపం వస్తుంది. దాంతో చెయ్యి చేసుకుంటాం తర్వాత బాధ పడతాం .
7. మనమనుకున్న లక్ష్యాన్ని చేరలేక పోతే కోపం వస్తుంది.
8. పిల్లలకు మార్కులు తక్కువ వస్తె కోపం వస్తుంది.
9. ఇంట్లో భార్య వంట సరిగ్గా చేయకపోతే కోపం వస్తుంది.
10. స్నేహితులంతా కలిసి పార్టీ చేసుకుంటూ మనల్ని పిలవక పోతే కోపం వస్తుంది.

ఇవ్వన్నీ సాధారణంగా వచ్చే కోపాలు. అకారణంగా కూడా కోపం వస్తుంది. అదెలా అంటే
1 స్నేహితుడు మనకన్నా మంచి స్థితిలో ఉన్నప్పుడు మనం లేమనే బాధ కోపంగా మారుతుంది.
2 పక్కింటి వాడు కారు కొన్నాడు మనకు బైక్ కూడా లేదు అనే కోపం వస్తుంది.
3 పక్కింటి పిల్లాడికి మంచి ర్యాంక్ వచ్చింది మన పిల్లాడు కేవలం పాస్ అయ్యాడు అనే కోపం వస్తుంది.

మరి కోపాన్ని జయించడం ఎలా సాధ్యం :-

కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మన చేతిలోనే ఉంది. కోపం వచ్చినప్పుడు పైన చెప్పిన కారణాల తో పోల్చుకుంటే కాగితం పై వారేం చేశారు , నేనేం చేయలేదు.
వాళ్ళు వారి లక్ష్యం కోసం ఎంత కష్టపడ్డారు.

పిల్లల శక్తి అంతెనేమో , భార్య వంట సరిగ్గా చేయకపోతే ఆమె ఏదైనా బాధ లో ఉందేమో, బాస్ నన్ను కాకుండా వేరే వాళ్ళని అంటున్నారు అంటే నాలో ఏం లోపం ఉంది అనేది ఆలోచించాలి. ఇలా ఆలోచించి నాణేనికి ఒక వైపు కాకుండా రెండూ వైపులా ఆలోచించ గలిగినప్పుడు కోపాన్ని అదుపులో పెట్టుకోవడం పెద్ద కష్టం కాదు.

పైగా కోపం లో ఉన్నప్పుడు మన ఆరోగ్యం మీద దాని ప్రభావం అధికంగా ఉంటుంది.కాబట్టి దేనికి చలించకుండా శాంతంగా ఆలోచించ గలగాలి.

ఆ మీరు అంటారు అండి మీకేం తెలుసు ఆ బాధ అంటారేమో ఇది పాటించడం చాలా కష్టమే కానీ మీ ఆరోగ్యం కోసం, మీ కుటుంబం కోసం శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి.

ప్రమోషన్ మళ్లీ రావచ్చు. కానీ ఒక్కసారి శాంతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటూ కోపం వచ్చినప్పుడు చిరునవ్వు తో దాన్ని జయించవచ్చు అని గ్రహించండి.

తన కోపమే తన శత్రువు
తన శాంతమే తనకు రక్ష
అనేది మర్చిపోకుండా ఉంటారని ఆశిస్తూ…

 

-భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *