గురువులు ఎన్ని రకాలు ఉంటారు ?
గురువులు ఎన్ని రకాలు ఉంటారు ?
గురువుల వలన నీకు ఏమిటి ఉపయోగం ?
ఏ గురువిని నువ్వు ఆశ్రయించాలి .
***********
1) సూచక గురువు : బాల్యం నుండి నీకు నాలుగు అక్షరాలూ నేర్పించి కే.జి నుండి పి.జి వరకు నీకు
బ్రతుకు తెరువు కోసం భోదన చేసే గురువులు ఎందరో . నీ జీవితంలో నువ్వు ఒక ఉన్నత స్దితిలో ఉండటం కోసం ఎన్నో సలహాలు ఇస్తారు . వీరిని సూచక గురువు అంటారు . వీరి ద్వారా భుక్తి మార్గం తెలుసుకుంటావు .
2 ). *వాచక గురువు *:ధర్మా ధర్మ విచక్షణ , మంచి చెడు విశ్లేషణ , చతురాశ్రమాలు వాటి ధర్మాలు గురించి చెపుతారు ( బ్రహ్మ చర్యము , గృహస్త్దము , వానప్రస్దం , సన్యాసం ) . వీరి ద్వారా ఎలా జీవించాలి అని అవగాహనతో వసిస్తావు .
3 ). భోధక గురువు : మహా మంత్రాలను ఉపదేశిస్తారు .లౌకికంగా కోర్కెలు తీర్చే వాటిని , అలౌకిమైన మోక్షానికి మార్గం చూపే వాటిని . వీరిని భోధక గురువు అంటారు . లోకికం నుండి అలోకికం వరకు మెల్లగా అడుగులు వేస్తావు .
4 ) నిషిద్ద గురువులు : మారణ ప్రయోగాలు , వశికరణాలు , వినాశనాలు ఇలాంటివి నేర్పే గురువులను నిషిద్ద గురువు అంటారు …. ఇలాంటి వారి దగ్గరకు వెళ్ళక పోవడం చాలా మంచిది . చిత్తాన్ని శుద్ధి చేయరు. విత్తాన్ని హరిస్తారు . ( పతనం కావాలి అనుకుంటే ఇలాంటి గురువులను ఎన్నుకోవాలి )
5 ) విహిత గురువు : మన హితము గోరి సూచనలు సలహాలు ఇస్తారు , నశించి పోయే విషయ భోగాలు
పై ఆశక్తి తగ్గించి , సత్యమైన శాశ్వతమైన విషయాల పై అంతర్ముఖం చేస్తాడు . ( ఏది సత్యం ఏది అసత్యం అని విచక్షణ తో జీవిస్తావు )
6) కారణ గురువు : ఇతను మోక్షం గురుంచి మాత్రమే చెపుతారు .ఎన్ని సుఖాలు అనుభవించినా అంతిమ లక్ష్యం ముక్తి ఐహిక బంధాల నుండి విముక్తి అని చెప్పి శిష్యులను ఎప్పుడు ఎరుకలో ఉంచుతూ ఉంటారు ,( నిత్య ఎరుకతో కర్మ యోగిలా కదిలి పోతూ ఉంటావు )
7.) *పరమ గురువు *: ఇతను సాక్షాత్ భగవత్ స్వరూపం పరిపక్వం చెందిన శిష్యుని వెతుకుతూ వస్తారు .
శిష్యునికి సన్మార్గం భోధించి ‘’ ఈ చరా చర జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది నేనే’’ అని అనుభవ పూర్వకంగా తానూ తెలుసుకుని ‘’ అహం బ్రహ్మస్మి అనేది కేవలం పదం కాకుండా ఆ పదాన్ని నీకు ఆవాహన చేసి నీవు అనుభూతి చెంద గలిగే స్దితికి తీసుకు వెళ్ళే వారు ఈ పరమ గురువులు . వీరు ఎక్కడో కోటిలో ఒక్కరు మాత్రమే ఉంటారు . నీ నిజ జీవితంలో ఇలాంటి గురువు తారస పడితే సాక్షాత్ భగవంతుడు నీతో జత నడిచినట్లే . ( నువ్వు వచ్చిన పని నీకు తెలియచేసి నీ విడుదల కు మార్గం చూపేవారు పరమ గురువు )
-సేకరణ