తార
నేను తళ తళ మెరిసే తారని
నన్ను చూసి ఒక తార అనుకొని
చందమామ నన్ను తనలో కలుపుకుంటూ
ఆకాశంలో ఎన్నో తారలు ఉన్న
అన్నిటినిలో నేను అందంగా కనిపిస్తూ ఉండడం
నా జీవితంలో నువ్వే మెరిసే తారవి
ఆకాశంలో నువ్వు చందమామ అయితే ,
నేను నీ పక్కనే ఉన్న తారని
నీకు తారలు చిన్నవిగా కనిపించినా
అవి రగులుతున్న అగ్ని గోళాలు
వాడి లోతుల్లోకి చూసేనే తెలుస్తుంది మనిషి విలువ..
కంటికి కనిపించే తారలు ఎన్ని ఉన్నా
నా చెంతకు చేరే తారవి మాత్రం నువ్వే
నక్షత్రాల తోటలో నేను విహరిస్తూ
భువిలోకి వచ్చిన ఒక తార
నేను ఆ తార వెతుకుతూ
ఆ తార నాకు అందని దూరంగా వెళ్ళిపోయింది అని
నేను తెలుసుకొని
అందని తార కోసం ఆరాటం పడుతూ అని అనుకొని
ఆ తార కంటే దూరంగా నేను వెళ్ళిపోయాను…
-మాధవి కాళ్ల