ప్రేమ జ్వాల మొదటి భాగం
ప్రేమ గురించి ఎంత చెప్పినా ఇంకా ఎదో మిగిలి పోతూనే ఉంటుంది. ప్రేమ రెండు అక్షరాల పదం కాదు ప్రేమ రెండు గుండెల చప్పుడు రెండు మనసుల, రెండు హృదయాల కలయిక ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు అలా అని ప్రేమంటే ఏంటి అని ప్రేమికులని ఎవర్నైనా అడిగామే అనుకోండి వాళ్ళు ప్రేమంటే ఏమిటో చెప్పలేరు. వాళ్ళే కాదు ప్రపంచంలో ఏ ప్రేమికులని అడిగినా ప్రేమంటే ఏమిటో చెప్పలేరు కొందరు.
మనసుల కలయిక చూడకుండా ఉండలేక పోవడం కలుసుకోకుండా ఉండలేము అబ్బో ఇలాంటివి చాలా చెప్తారు కానీ అది కాదు ప్రేమకు అర్ధం మరి మీకు తెల్సా అని అడుగుతారా లేదండి నాకు కూడా తెలియదు తెలుసుకుందాం అనే నా ఆలోచన అలా ప్రేమని వెతుకుతూ ఉన్నప్పుడు నాకు చాలా ప్రేమలు చూసాను తల్లి కొడుకులు, తల్లి కూతుర్లు,తండ్రి కూతుర్లు, అన్నదమ్ముల, తమ్ముడు అక్క ఇలాంటివి ఎన్నో ప్రేమలు కనిపించాయి.
కానీ ప్రేమికుల ప్రేమ మాత్రం నాకు ఇప్పటి వరకు కనిపించలేదు. ప్రేమ అనే పదం చాలా నిర్దయ కలిగింది ఈ ప్రేమలో పడి ఒక లైలామజ్ను, పార్వతి దేవదాసు, సలీం అనార్కలి, రోమియో జూలియట్, వీళ్ళంతా అందులో పడి కొట్టుకు పోయారు.
ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోలేక జివించ లేక వేరే వారి తో జీవితాన్ని పంచుకోలేక అటూ కన్నా వారిని బాధ పెట్టలేక తమ మనసుని చంపుకోలేక జీవితాన్ని అంతం చేసుకున్నవారె,ఇదంతా ఒక తరం అయితే ఇంకోక తరంలో తమ ప్రేమని దక్కించుకున్న వారిని వెళ్ళ మిద లెక్కబెట్టవచ్చు. తమ ప్రేమని సార్ధకం చేసుకున్న వారు ఎంత మంది తమ జీవిత భాగస్వామి తాము ప్రేమించిన వారినే పొంది ఉంటారు.
మరి ప్రేమ కు పరాకష్ట పెళ్ళేనా ? ప్రేమించిన వారందరూ పెళ్ళి చేసుకుంటున్నారా? ఎలాగూ పెళ్ళి చేసుకోలేము కాబట్టి ప్రేమించకుండా ఉంటున్నారా? ఇలాంటి ప్రశ్నలు నేను ప్రేమంటే ఏంటని వెతుకుతున్నప్పుడు నాకు వచ్చాయి. మరి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోక పొతే ? ఇంకొకరి భార్య అయితే ? ఆమె కళ్ళ ముందే ఇంకొకరి భార్య అయితే ఆ ప్రేమికుడి, ప్రేమికురాలి బాధ ఎలా ఉంటుంది ? ప్రేమించుకున్న వారు అనుకోని పరిస్థితి లో వేరొకర్ని పెళ్ళి చేసుకోవాల్సి వస్తే వారి మనోభావాలు ఎలా ఉంటాయి ?
ఇద్దరిలో ఒకరు ఎక్కువగా ఇంకొకర్ని ప్రేమించి వాళ్ళు లేకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నప్పుడు హటాత్తుగా ప్రేమికుడి కానీ ప్రేమికురాలి పెళ్ళి జరిగిపొతే వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది ? ప్రేమికులు అంటే విడిపోవడమేనా జరిగేది ?నిజమైన ప్రేమికులు అంటే ఎవరు ?
ఈ కాలంలో మరి నిజమైన ప్రేమికులు ఉన్నారా ? నూటికి తోoబై ప్రేమలు స్వార్ధ పూరితమైన ప్రేమలే అని నేను అంటాను నిజం కాదాoటారా ? అనరు అనలేరు ఎందుకంటే ఇప్పటి ప్రేమల్లో అన్ని దాదాపు స్వార్ధమే కాబట్టి అయినా అందర్నీ తప్పు పట్టలేం ఇంకా ఎక్కడో ఒక చోట నిజమైన ప్రేమ ఉంది. వాళ్ళు ప్రేమ కోసమే బతుకుతారు,ప్రేమలో జీవిస్తారు ప్రేమ లో మునిగి తేలతారు..
ప్రేమ రెండు హృదయాల సవ్వడి, ప్రేమ రెండు మనసుల కలయిక , ప్రేమ ఒక కొత్త శక్తి, ప్రేమ ఒక నూతన తేజం, ప్రేమ మనిషికి మనిషికి మధ్యన జరిగే ఒక రసాయనిక సమ్మేళనం, ప్రేమ ఒక నూతనం, ప్రేమ సత్యం ,ప్రేమ నిత్యం, ప్రేమే ప్రాణం, ప్రేమ అంతం లేనిదీ, ప్రేమ అంతు లేనిదీ, ప్రేమ ప్రపంచాన్ని దాటేది,
ప్రేమ ఎల్లలు లేనిదీ, ప్రేమ శక్తివంతమైంది కాబట్టే ప్రేమకు ఉన్న మహిమ ఎవరు ఎక్కడికి వెళ్ళినా వారిని తిరిగి రప్పించ గలిగేది. ప్రేమ ఎంతటి కరుడు కట్టిన వాడిని అయిన మార్చేది. ప్రేమ ప్రాణాలు తీసేది , ప్రేమ ప్రాణాలు పోసేది ఈ ప్రేమనే…
ఒక కరుడు గట్టిన వాడు ప్రేమలో పడితే ఏం చేస్తాడు ? ఆ ప్రేమని పొందలేక పొతే అతను మళ్ళి ఎలా మారతాడు ? తన ప్రేమ కోసం ప్రేమించిన వారి కోసం ఏం చేసాడు అనేదే నా ఈ కథ ….
********
ఆర్మీ ఆఫీసర్ రంజీత్ హడావుడి పడుతూ గది లోకి వచ్చి,తన పై ఆఫీసర్ అయిన వేణు గారికి సెల్యూట్ చేసాడు,వేణు అది చూస్తూ వాట్ హప్పెండ్ రంజీత్ ఎనీ ప్రాబ్లం అన్నాడు,యెస్ సర్ కరుగు గట్టిన తీవ్రవాది షెక్ అహమద్ మన నుండి తప్పించుకుని భారత దేశానికి వెళ్ళాడని ఇన్ఫర్మెషన్ వచ్చింది సర్ అతను చాలా డేంజెర్.
వాడు మన దేశం లోకి వెళ్ళి ఇంకా ఏం చేస్తాడో ,ఎంత రక్తపాతం సృష్టిస్తాడో అనే అనుమానం కలుగుతుంది.ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి సర్ అని అడిగాడు రంజిత్.ఏం చేద్దాం చెప్పు రంజిత్ నువ్వే ఒక బాధ్యత తెలిసిన ఆఫీసర్ గా దేశాన్ని కాపాడే సైనికుడిగా నీకు ఏమనిపిస్తుందో చెప్పు నాకు ఏ ఐడియా లు రావడం లేదు.
ఇప్పుడు అందరికి చెప్పి హయిగా గుండెల మిద చేతులువేసుకుని నిద్ర పోతున్న వారిని ,మనమున్నమనే నమ్మకం తో ఉన్నవారిని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి వారెవరికి తెలియకుండా ఈ సమస్యను మనమే పరిష్కరించాలి అంటే మనమేం చేయాలో చెప్పు రంజీత్ వాడు ఆ తీవ్రవాది ఎంత హింసని ప్రేరేపిస్తాడో ఏంటో,ఏదైనా మంచి ఆలోచన చెప్పు రంజిత్ అన్నాడు వేణు,వారిద్దరూ ఆరు నెలల తేడా తో ఆర్మీ లో జాయిన్ అయ్యారు.
కాస్త చనువు ఎక్కువే,నువ్వు ఒక ఆర్మీ ఆఫీసర్ లా కాకుండా ఒక కుటుంబ పెద్దగా అలోచించి చెప్పు,నువ్వేది చెప్పినా అమలు చేయడానికి నేను సిద్దం గా ఉన్నాను అన్నాడు వేణు.
సర్ మీరేనా ఇలా మాట్లాడేది మాకు దైర్యం చెప్పాల్సిన వారె ఇలా బెంబేలు పడితే ఎలా సర్ మాకు సలహాలు ఇవ్వాల్సిన మిరే ఇలా నా సలహా అడగడం విపరితంగాను,వింతగాను ఉంది సర్ అన్నాడు రంజిత్ వేణు తో,
చూడు రంజిత్ ఈ ఉద్యోగం లో ఎన్నోసార్లు ఒక్కడినే నిర్ణయాలు తీసుకున్నా కానీ ఎప్పుడు ఈ వ్యక్తి విషయంలో నిర్ణయం నికే వదిలేస్తున్నా వాడు పసి పిల్లల రక్తం తాగే క్రూరుడు,వాడిని మార్చడం ఎవరి వల్లా కాలేదు కాబట్టి ఎన్ని హింసలు పెట్టినా భరిస్తూ,ఎంత గట్టిగా నిర్భందించినా మన కళ్ళు గప్పి పారిపోతున్నాడు.
నా ఆలోచనలకూ పదును తగ్గిందే అనుకో,ఇంకేమైనా అనుకో ఇది నువ్వు నాకు ఆప్త మిత్రుడివి అని నిన్ను సలహా అడిగాను ఒక మిత్రుడిలా నాకు అండగా నిలబడు నన్ను నడిపించు అని రంజిత్ దగ్గరగా వచ్చి చేతులు పట్టుకున్నాడు వేణు..
వేణుమాటలు వింటున్న రంజిత్ ఏం చెప్పబోతున్నాడు,అతను చెప్పబోయే సలహా వల్ల ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయి?చదవండి తదుపరి భాగం లో ..
-భవ్యచారు