కురిసే వెన్నెల

కురిసే వెన్నెల

వెచ్చని ఉదయం
తొలకరి జల్లులా పలకరిస్తుంటుంది
మనసు పులకరిస్తుంది

మూగవీణలా మూలన కూచున్న మనసును
అమ్మస్పర్శలా తడుముతుంటే
నీలినీడల ఆలోచనలు అదృశ్యమవుతాయి

కాలంచేసే మాయాజాలంలో
ఉదయం ఓ విడిది
పారే నదిలా,ఉరిమే ఉత్సాహంలా
ఉప్పొంగే తరంగంలాంటి అంతరంగంలో
కురిసే వెన్నెల ఉదయం
ఆనందాల కోవెల ఉదయం

 

-సి.యస్.రాంబాబు

0 Replies to “కురిసే వెన్నెల”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *