తిరుమల గీతావళి
పల్లవి..
రావా స్వామి కలతలు తీర్చ
వినవా స్వామీ వేదనలన్నీ
పదమే పాటై నిను వెతికేను
అర్థము తెలిసి మది మురిసేను
చరణం..
నిను చూసినచో కలతకు సెలవే
నీ చిరునవ్వే కనులకు కాంతే
నీ నామముతో మనసుకు శాంతే
ఇది నిజమయ్యా..నీ తోడయ్యా
చరణం
నీ నీడేగా తిరుమలకొండా
నీ సేవనతో తరియించేను
నీ పిలుపేగా మాకు అండా
నీ తలపేగా మము కాచునది
చరణం
నీ దర్శనమే దొరకదు స్వామి
నీ చిరునవ్వే కావాలయ్యా
ఆపదలొస్తే నీవేనయ్యా
భారము మాది నీదేనయ్యా
చరణం
నీ కృప కోసం వేచేమయ్యా
వేదనలన్నీ వీడునుకాదా
నీ పలుకొకటే వేడుక మాకు
నీ పాదాలే మా భాగ్యాలు
-సి.యస్. రాంబాబు