ఆలోచన లేకుండా
“శ్రీకర్ నేను ఈరోజు తొందరగా ఆఫీస్ కి వెళుతున్నా , నీ లంచ్ బాక్స్ టేబుల్ మీద పెట్టాను , మర్చిపోవద్దు. నువ్వు లాక్ వేసి వెళ్ళిపో” అని చెప్పి వెళ్ళిపోయింది వాసవి.
శ్రీకర్ ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసి బాక్స్ తీసుకొని బ్యాగులో పెట్టుకొని ఇంటికి లాక్ వెళ్ళిపోయాడు.
శ్రీకర్ , వాసవి ప్రేమించుకొని పెద్ద వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
ఇద్దరు వేరే వేరే కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఇప్పుడే పిల్లలు వద్దు అనుకొని ఉన్నారు. శ్రీకర్ వాళ్ళ అమ్మ ఎప్పుడు నన్ను నానమ్మని చేస్తారు అని అడుగుతుంది.
ఒక అమ్మాయి శ్రీకర్ కాల్ లో మాట్లాడుతున్నాడు అది చూసి వాసవి కోపంతో రూంలోకి వెళ్ళిపోయింది.
ఈ విషయం తెలియని శ్రీకర్ రూంలోకి వచ్చి పట్టించుకోలేదు. అది చూసి “ఏంటి మేడం గారు సీరియస్ గా ఉన్నారు” అని అడిగాడు.
“నువ్వు ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావ్” అని సూటిగా అడిగింది వాసవి.
“నా ఆఫీస్ కొలీగ్ రమ్య తన ప్రేమ విషయం రాజేష్ కి చెప్పు అని అడుగుతుంది. నీకు రమ్యని ఒకసారి పరిచయం చేశాను. నీకు గుర్తు ఉందా?” అని అడిగాడు శ్రీకర్.
“
హా.. గుర్తు ఉంది. అవునా” అని చెప్పింది వాసవి.
“రాజేష్ నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా. నువ్వే తన ప్రేమ విషయం చెప్పితే చాలా బాగుంటుంది” అని చెప్పడంతో వాసవి ఆలోచనలో పడింది.
కాసేపు ఆలోచించి “ఈ సండే రమ్యని నువ్వు డిన్నర్ కి రమ్మని చెప్పు నేను కూడా రాజేష్ ని రమ్మని చెప్తాను” అని చెప్పింది వాసవి.
“గుడ్ ఐడియా వాసవి రేపే రమ్యకి చెప్తాను” అని చెప్పి నాకు నిద్ర వస్తుంది అని చెప్పి పడుకుంటాడు శ్రీకర్.
స”రే నువ్వు పడుకో నాకు కొంచెం వర్క్ ఉంది కంప్లీట్ చేసి నేను పడుకుంటాను గుడ్ నైట్” అని చెప్పింది వాసవి.
ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఈ సండే డిన్నర్ కి ఇంటికి రా అని చెప్పాడు శ్రీకర్.
“ఏంటి స్పెషల్ డిన్నర్ కి రమ్మని చెపుతున్నారు” అని అడిగింది రమ్య.
“ఆ రోజు వాసవి బర్త్ డే తనకి సర్ప్రైజ్ చేద్దామని నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? రాజేష్ కూడా వస్తాడు. నీ ప్రేమ విషయం అప్పుడు చెపుతాను” అని చెప్పాడు శ్రీకర్.
“తప్పకుండా హెల్ప్ చేస్తాను. అవునా ఈ విషయం మందే ఎందుకు చెప్పలేదు” అని ఆనందంతో అడుగుతుంది రమ్య.
“ఇప్పుడు చెప్పాను కదా. సరే నాకు వర్క్ ఉంది” అని చెప్పి తన సీట్ లోకి వెళ్లిపోయాడు శ్రీకర్.
“హలో వాసవి రమ్య కి డిన్నర్ కి రమ్మని చెప్పాను కానీ ఏంటి స్పెషల్ అని అడిగింది. నీ బర్త్ డే” అని చెప్పా అని చెప్పాడు శ్రీకర్.
“అవునా! నేను కూడా రాజేష్ కి చెప్పితే నీ బర్త్ డే” అని చెప్పాను అని చెప్పింది వాసవి.
“నా బర్త్ డే ఎప్పుడు రాజేష్ కి తెలుసు కదా” అని డౌటుగా అడిగాడు శ్రీకర్.
“అవును కదా. నేను ఆ సంగతే మర్చిపోయాను. నువ్వు ఉండు రాజేష్ కాల్ చేస్తున్నాడు ” అని చెప్పింది వాసవి.
“సరే నువ్వు మాట్లాడు నేను ఉంటా” అని చెప్పి కాల్ కట్ చేస్తాడు శ్రీకర్.
“ఏంటి మళ్ళీ కాల్ చేశావు” అని అడిగింది వాసవి.
“అది శ్రీకర్ బర్త్ డే క్రితం నెలలలో అయిపోయింది కదా. మళ్ళీ బర్త్ డే అని డిన్నర్ కి పిలుస్తున్నావ్” అని అడిగాడు రాజేష్.
“ఊరికే జోక్ చేశా. మనం కలిసి చాలా రోజులు అయ్యింది కదా , అందుకే డిన్నర్ కి పిలిచా. నువ్వు డిన్నర్ కి వస్తున్నావా?’ అని అడిగింది వాసవి.
“సరే వస్తాను” అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రాజేష్.
“శ్రీకర్ మనం వాళ్ళ ఇద్దరిని మానేజ్ చేయడానికి చాలా కష్టం పడ్డాము. రాజేష్ అమ్మ వాళ్ళకి ఈ విషయం చెప్పాను. వాళ్ళు రాజేష్ కి ఇష్టం అయితే మాకు ఇష్టమే అని చెప్పారు” అని చెప్పింది వాసవి.
“ఇంకా రాజేష్ రమ్య వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవాలి” అని చెప్పాడు శ్రీకర్.
“అవును” అని చెప్పింది వాసవి.
“అదిగో రాజేష్ వస్తున్నాడు నువ్వు తనతో మాట్లాడు నేను ఇప్పుడే వస్తాను” అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీకర్.
“హాయ్ రాజేష్ ఎలా ఉన్నావ్? నేను బానే ఉన్నాను. నిన్ననే ఆంటీ కాల్ చేసి మీ అబ్బాయికి ఎప్పుడు పెళ్లి చేస్తారు. ఇంకా ఎంతకాలం సింగిల్ గా ఉంటాడు” అని అడిగింది వాసవి.
“హలో నేను బాగున్నా. అవునా నేను కాల్ చేసినప్పుడు నాకు చెప్పలేదు. ఈ లైఫ్ లాంగ్ నేను సింగిల్ గానే ఉంటాను. అసలు పెళ్లే చేసుకోను” అని చెప్పాడు రాజేష్.
“అవునా ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోవు? ఎవరినైనా ప్రేమించావా?” అని అడిగింది వాసవి.
“ఒక అమ్మాయిని ప్రేమించాను. నా ప్రేమ విషయం చెప్పేలోపే అమ్మాయికి పెళ్లి అయిపోయింది. అందుకే నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోను” అని సూటిగా చెప్పేసాడు రాజేష్.
“మనం చిన్నప్పటినుంచి ఫ్రెండ్స్ కదా. ఆ అమ్మాయి ఎవరు నాకు తెలుసా?” అని అడిగింది వాసవి.
“ఆ అమ్మాయి ఎవరో కాదు నువ్వే నేను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను. కానీ నువ్వు శ్రీకర్ ని ప్రేమించావు. నా ప్రేమ విషయం చెప్పలేకపోయాను నీకు. ఎన్నోసార్లు శ్రీకర్ ని, నిన్ను విడదీయాలని అనుకున్నాను.
కానీ నేను వేసిన ప్లాన్లు అన్ని ఫెయిల్ అయ్యాయి. మీ మధ్యన వచ్చిన గొడవల్ని పెద్దవి చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను అది మాత్రం జరగలేదు ఇంకా మీ బంధం బలపడింది” అని చెప్తుండగా ఎదురుగా వస్తున్న రమ్య ని చూసి సైలెంట్ అయిపోయాడు రాజేష్.
వస్తున్నా రమ్యకి ఎదురు వెళ్లి కౌగిలించుకొంది వాసవి. “కొద్దిసేపట్లో పార్టీ స్టార్ట్ అవుతాంది వెయిట్ చెయ్ ఇక్కడ కూర్చో అని చెప్పి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి రాజేష్ నీతో కొంచెం మాట్లాడాలి రా అని చెప్పి వెళ్ళిపోతారు.”
“చూడు రాజేష్ నాకు పెళ్లయింది మా మధ్య ఎన్నో గొడవలు వస్తాయి వాటికి విడిపోయి అంత బలహీన బంధం కాదు మాది అని వార్నింగ్ ఇస్తూ” చెప్పింది వాసవి.
ఇప్పటికైనా ఆలస్యం చేయకు వాసవి. నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను. శ్రీకర్ కంటే నిన్ను బాగా చూసుకుంటాను నేను. శ్రీకర్ కి ఇప్పుడే విడాకులు ఇచ్చేయ్” అని చెప్పాడు రాజేష్.
“జస్ట్ షట్ అప్” అని చెప్పి రాజేష్ చెంప చెల్లుమనిపించింది వాసవి.
శ్రీకర్ వచ్చి రమ్యని పలకరించి “ఈరోజు వాసవి పుట్టినరోజు కాదు నీ ప్రేమ విషయం రాజేష్ కి చెప్పాలని ఇలా డిన్నర్ కి రమ్మని చెప్పాము అంతే. నువ్వు ధైర్యంగా నీ ప్రేమ విషయం రాజేష్ కి చెప్పు” అని చెప్పాడు.
“థాంక్యూ శ్రీకర్ థాంక్యూ సో మచ్” ఆనందంతో చెప్పింది రమ్య.
“నైట్ డిన్నర్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద అందరూ కూర్చున్నారు. డిన్నర్ చేసిన తర్వాత కాసేపు సోఫాలో కూర్చొని కబుర్లు చెబుతూ రమ్య నీ ప్రేమ విషయం చెప్పు లేట్ ఎందుకు చేస్తున్నావు వెంటనే చెప్పేయ్ అంటూ తొందరగా పెడుతుంది వాసవి.”
కొంచెం ధైర్యం చేసి “రాజేష్ దగ్గరికి వెళ్లి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?” అని అడిగింది రమ్య.
“సారీ రమ్య నేను వేరే అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను” అని చెప్పేసి వెళ్ళిపోతాడు రాజేష్.
ఎన్నిసార్లు పిలిచిన వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు రాజేష్. రమ్య ఏడుస్తూ వెళ్ళిపోద్ది.
“ఏంటి శ్రీకర్ ఇలా జరిగిందేంటి? మనం వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది” అని చెప్పి డల్ గా తన రూమ్ లోకి వెళ్ళిపోయింది వాసవి.
కోపంతో శ్రీకర్ కూడాను రూమ్ లోకి వెళ్లి
“రాజేష్ రమ్యని పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టం లేదు కదా” అని అడిగాడు.
“నాకు అలా ఎలాంటి అభ్యంతరం లేదండి” అని చెప్పింది వాసవి.
“మరి రాజేష్ నువ్వు ప్రేమిస్తున్నావు కదా మరి నాకెప్పుడూ విడాకులు ఇస్తున్నావు” అని కోపంతో అడిగాడు శ్రీకర్.
“ఛీ వాడిన్ని ప్రేమించడం ఏంటండీ? వాడు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అంతే. నేను మనస్ఫూర్తిగా ప్రేమించేది మిమ్మల్ని. నేను ఎందుకు మీకు విడాకులు ఇస్తాను” అని కన్నీళ్లు పెడుతూ అడిగింది వాసవి.
“నువ్వు రాజేష్ మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను” అని చెప్పాడు శ్రీకర్.
“వాడి ప్రేమ విషయం కూడా నాకు తెలియదు. ఈరోజే నాకు చెప్పాడు” అని చెప్పింది వాసవి.
కొన్ని రోజుల తర్వాత రాజేష్ కి తనకి జరిగిన విషయాలన్నీ రమ్యకి చెప్పింది వాసవి.
“తనని నేను మార్చుకుంటాను. నన్ను పెళ్లి చేసుకునేలా చేస్తాను అని వాసవి కి ప్రామిస్ చేస్తుంది రమ్య.”
“ఒక వారం తర్వాత మా పెళ్లి రోజు ఉంది. అప్పుడు నేను ప్రెగ్నెంట్ అనే విషయం కూడా శ్రీకర్ కి చెప్పాలి అనుకుంటున్నాను నువ్వు నాకు హెల్ప్ చెయ్ అని అడిగింది వాసవి.”
“తప్పకుండా చేస్తాను ముందు రాజేష్ ని మార్చాలి” అని చెప్పేసి వెళ్ళిపోతుంది రమ్య.
“వన్ మంత్ తర్వాత రాజేష్ వచ్చి నన్ను క్షమించు వాసవికి పెళ్లయినా కూడా తననే ప్రేమించి నీకు విడాకులు ఇచ్చేయమని చెప్పాను. చాలా తప్పులు చేశాను నన్ను క్షమించు అని బ్రతిమిలాడాడు.
వాసవి ఏమి ఆలోచన లేకుండా భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నది.
ఈరోజు మీ పెళ్లి రోజు వాసవి నీకు సప్రైజ్ ఇవ్వాలనుకుంది. అది ఏంటో తెలుసుకోవాలంటే మీ ఇంటికి వెళ్ళు అని చెప్పాడు.”
ఏమీ ఆలోచించకుండా ఇంటికి బయలుదేరాడు శ్రీకర్.
అక్కడ రమ్య పెట్టిన టెన్షన్ చూసి వాసవికి ఏమో అయిందని భయంతో లోపలికి వెళ్ళాడు.
“హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మై డియర్ పార్ట్నర్. మనం తొందర్లోనే అమ్మా నాన్నలు కాబోతున్నాము” అని తలదించుకొని చెప్పింది వాసవి.
“సారీ ఏ ఆలోచన లేకుండా భవిష్యత్తు కోసం ఏమీ ఆలోచించకుండా ఇలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు” అని చెప్పాడు శ్రీకర్.
పెళ్లిరోజుని హ్యాపీగా గడిపారు.
“కొద్దిరోజుల్లోనే పెళ్లి జరగబోతుంది” అని చెప్పాడు రాజేష్.
రమ్య నువ్వు అనుకున్న సాధించావు అని వాసవి మెచ్చుకుంది. అందరూ ఆనందంతో ఉన్నారు.
-మాధవి కాళ్ల