పట్టుదల
భవిష్యత్తులో ఏదో కావాలని ఏదో సాధించాలని ఎన్నో కలలు కన్నాను..
నేనే కాకుండా మా కుటుంబ సభ్యులు కూడా కన్నారు అవేనండి కలలు..
ఎన్ని కంటే ఏం లాభం? చివరకు
ఏమీ సాధించకుండా ఇలా మిగిలి పోయాను..
కానీ..
సాధించాలనుకున్న వాళ్లు కష్ట పడి ఇష్టంగా సాధించండి..
నాలాగా వ్యర్థంగా మిగిలి పోకండి..
భవిష్యత్తంతా బాధ పడుతుంటాం!
నాకేమెా పట్టుదల ఉన్నా పరిస్థితులు అనుకూలించ లేదు..
భవిష్యత్తు బాగుండాలంటే పట్టుదల దాంతో పాటు ఓపిక ఉండాలి..
అవి రెండూ ఉన్నా అధృష్టం కూడా ఉండాలండోయ్!!
అంతే కదా!!
-ఉమాదేవి ఎర్రం