మనసులో ఆలోచనలు
నాలో రేగే ఆలోచనలను పంచుకోవడానికి
ఎవరి తోడు అవసరం లేదు
ఆకాశంలో ఉన్న తారలను లెక్క పెట్టినట్టు
నా మనసులో ఆలోచనలను వదులుకోవడం చాలా కష్టం
మనసులో ఆలోచనలు నీ చుట్టే తిరుగుతూ
నా మదిని ఉక్కిరబిక్కిరి చేస్తూ
సాధించాలని తపన , పట్టుదల ఉండాలి కానీ
మనసంతా గందరగోళంగా లేకుండా చూసుకుంటూ
చెలిమి చేందాం అనుకుంటే కన్నీరే హీనంగా చేస్తూవుంటే
నీకు దగ్గర అయ్యో కొద్ది నేను మనశ్శాంతి దూరం అవుతూ
మార్గం లేని గమ్యానికి బాటలు వేయడం ఎలా
మనసులో ఆలోచనలకు హద్దు లేకుండా
నన్ను నేను ధైర్యం చెప్పుకోలేక
సంద్రం వచ్చే కెరటంగా మిగిలిపోతూ
నాకంటూ ఒక గమ్యం మీదే దృష్టి పెట్టుతూ
జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అనుకుంటున్నాను…
-మాధవి కాళ్ల