ఆ తరం

ఆ తరం

ఈ తరం..
అని ..
ఏ తరంలోనైనా..
ఆడవారి బ్రతుకులు..
ఒకటే..
అనాదిగా ..
పురుషాహంకారానికి…
బలవుతూనె ఉంది..
నాటి సీత నుండి..
నేటి గీత వరకు..
అవే బ్రతుకులు..
అసలా దేవుడే ఇలా..
రాస్తే ఇక చేసేదేముంది..
భరిస్తూ పోవడమే!!
కొంచం ఎదిరించామా!
నీలాప నిందలు వేస్తుంది..
ఈ లోకం…
ఆడదానికి ఆడదే శత్రువని..
నిరూపిస్తుంది…
ఇక ఆడ బ్రతుకులు …
ఇంతేనని సరిపెట్టుకు..
పోవడమే మనం చేసే పని!!

 

-ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *