నా ధైర్యం
మూడు ముళ్ళు ఏడడుగులతో సాగిన ప్రయాణం
కొన్నాళ్లు ఆనందంతో గడిపిన
వాళ్ల నిజస్వరూపం కొద్ది కొద్దిగా చూపిస్తూ
కాళ్ళకు సంకెళ్లు వేస్తూ
ఏ పని చేసిన తప్పు అంటూ
నాకంటూ ఒక మనసు ఉందని తెలుసుకోకుండా
నిర్ణయాలు వాళ్లే తీసుకొని పెత్తనం చెల్లయిస్తూ
నన్ను ఒక మనిషిలాగ చూడకుండా
నా మాటకు విలువ లేకుండా
నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ
నా బాధలు ఎవరికీ చెప్పుకోలేక
నాలో నేనే ఉక్కిరి బిక్కిరి అవుతూ క్షణంలో
పెళ్లి అనే పేరుతో నా జీవితాన్ని నాశనం చేస్తూ
వాళ్ళు పెట్టే బాధలు భరిస్తూ…… భరిస్తూ…..
నాలో సహనం చచ్చిపోయి
వాళ్లకి బుద్ధి చెప్పాలని కంకణం కట్టుకున్నాను
ఆడ బతుకులు అంటే ఇలా ఉండకూడదు అనేలా
వాళ్లకి చూపించాను…
వాళ్లలో మార్పు రావడానికి నా ధైర్యమే నాకు తోడుగా నిలిచింది…
ఆడ బతుకులు కాలం మారినా తరం మారిన ఇలాగే ఉంటాయని అర్థమవుతుంది…
ఇలాంటివి జరగకుండా ముందు తరాలకి అర్థమయ్యేలా చెప్పాలి…
-మాధవి కాళ్ల