కల
బయట బోర్డు..డాక్టర్ ఉమాదేవి ఎమ్ బి బి యస్ గైనకాలజిస్ట్..అని.. డాక్టరు ఉమ గారి తాలుకా నేను లోపలికి పంపనంటారేం?అక్కడున్న వాచ్ మెన్ ను అడుగుతున్నాడతను..
లేదు సర్ మేం అలా పంపం ఫోన్ చేస్తాం!మీ పేరు చెప్పండి మేడం రమ్మన్నాకే పంపిస్తాం!అయ్యెా! మేడం అన్నయ్యనే నేను
అన్నాడు మళ్లీ!
అలా కూడా పంపం సార్! మేడం ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు ఆపరేషన్ చేస్తున్నారు ఆగండి ఆగండి అంటూనె ఉన్నాడతను..ఆయన్ని నెట్టేసి లోపలికి వెళ్లాడతను..కిటికీ లోంచి చూస్తే మేడమ్ ఆపరేషన్ చేస్తుంది అంతా రక్తం..కసా కసా కట్ చేస్తుంది ఇలా అనుకుంటూ చేత్తో పరుపునంతాచించేస్తున్నాడు..
అమ్మ వచ్చి లేపుతుంది..లేరా! అశోక్ అని..అంతే! కల చెదిరింది..ఆ కల ఎవరిదనుకుంటున్నారు?నాది కాదండోయ్! మా అన్నయ్యది..
నన్ను ఎమ్ బి బి యస్ కోచింగ్ లో వేసి వచ్చి ఇలా కలగన్నాడట..
పాపం మా పరుపు బలి…
-ఉమాదేవి ఎర్రం