ఒంటరి
పుట్టేటపుడు ఒంటరివే!
చివరకు గిట్టేటపుడు..
ఒంటరివే!
మధ్యలోనె ఈ భవ బంధాలు..
వాటిని చూసి మురవబోకు..
ఒంటరి పక్షివని తెలుసుకో!
నీ బ్రతుకు నావను నడుపుకో!
పక్షి లాగా బ్రతకడం నేర్చుకో!
కూడబెట్టిన ధనము వ్యర్థమని…
తెలుసుకో!!
ధనము కోసము ఉన్న ప్రేమను..
వదులుకోకు..
ఎంత ప్రేమ ఉన్నా చివరకు నీ వెంట..
ఎవరూ రారులే!!
ధనము కూడా రాదులే!!
నీ బ్రతుకు ఒంటరి నావనే!!
-ఉమాదేవి ఎర్రం