రివాజు
సంజ కిరణాలతో
అభిషేకించిన
భానుడు పులకాంకితుడు
ఓపిక లేని ముసలవ్వ
మనుషులకు నీతి నిజాయితీలనిమ్మని
ఆ దైవాన్ని ఓపికగా అడిగేందుకు అడుగేస్తోంది
ముచ్చటపడిన కెంజాయరంగు ఆకాశం
ముసలమ్మకు ముద్దులు కురిపిస్తోంది
కనికరం లేని జనం
కులాసాగా కాలం గడుపుతున్నారు
కాలం కరుకైనది
దైవాన్నీ కరుణించదు
-సి.యస్.రాంబాబు