నిర్లక్ష్యం
పుట్టింటి వారు ఏరి కోరి నీ చేతిలో పెడితే..!
నా మీద ఎంత ప్రేమ ఉన్నా..
నిన్ను చూస్తూ కూర్చుంటే…
నాకేం వస్తుందని..
పక్కన పెట్టేసి
నీ వాళ్లను పట్టుకొని తిరుగుతూ వారి
గురించి ఆలోచిస్తూ
ని యోగక్షేమాలు చూసే
నన్ను నిర్లక్ష్యం చేస్తూ..
నీ వాళ్ల మెప్పు పొందడం కోసం
నా వాళ్లను హేళన చేస్తుంటే…
నీ బంధు వర్గం వారంతా…
నీ బలం చూసుకుని నన్ను
నీచపు మాటలతో
దెప్పి పొడుస్తూ ఉంటే…
అంతా వింటూ..
నేను లోలోన నలిగిపోతూ..
తిండి తిప్పలు మాని
నిద్రలేమి రాత్రులు
గడుపుతూ కంటి నీళ్లు దిగమింగుకుంటూ..
నీవు ఎప్పటికైనా…
నా దారికి వస్తావని…
నా మనోగవాక్షాలు…
తెరిచి వేచి చూస్తూ…
కొంతకాలం నిరీక్షిస్తూ..
కాలం గడపంగా..
నీ అంతట నీవుగా..
నీలో మార్పు తెచ్చుకొని..
నా దరికి చేరి సుఖమైన జీవితం గడుపుచుంటిమి.
-బేతి మాధవి లత