చిత్రకారుడు
చిన్ననాటి నుండి
నీ విషయాలు
వినుకుంటూ పెరిగి
పెద్దగై నీతో స్నేహితం
చేస్తూ నీ ముచ్చట్ల
జ్ఞాపకాల మడుగు
నెమరు వేస్తూ నీకు
తెలియని విషయం
ఒక్కొక్కటి చేరవేస్తూ
ఉంటే..!!
అందుకు ప్రతిఫలంగా
నన్ను నియంత చేసే
బాధ్యత లేదా అని
ఎదురు ప్రశ్నిస్తున్న
నాలోని రచయితనైతే బయటికి తీశావు కానీ
నీవు పిలిచిన ఒక్క
పిలుపుకే నాలో
నిద్రపోతున్న
చిత్రకారుడు
లేచి కాగితం ఎక్కడ
పెన్సిల్ ఎక్కడనని
గోల.. గోలా చేస్తూ..
నీ పిలుపు కోసం
తహతహలాడుతూ
వేచి చూస్తూ…
ఉక్కిరిబిక్కిరి
అవుతూ లోపల
ఉండలేక వెలుపలికి
రాలేక నీ శబ్ద ధ్వని
కోసం నా ఎద గుమ్మం దగ్గర నక్కి నక్కి చూస్తుండే..!
వాడిని కూడా సరియైన
దారిలో పెట్టక తప్పదని
గుర్తు చేస్తున్న…
-భేతి మాధవి లత