వేదనలకు ఆజ్యంపోస్తు…!!!
పొరలు కమ్మిన మబ్బుల చాటున
స్వార్థం చేసిన సామర్థ్యం తేలనిదిగా
సజీవ రూపాలకు నిర్మాణం కాలేక…
తెలియని ప్రాణం ఖరీదును నిరాకారాల
నిశ్శేష్టలతతో ముంచేస్తు విధి వంచన ఎంతో బలియమైనదని తలుస్తున్నావు…
పగలబడి నవ్విన ప్రతీకారాలలోని
ప్రత్యక్షతను వేదనలకు ఆజ్యంపోయిస్తు…
స్నేహాల చెలిమిని హృదయపు ఆకారాలుగా
పూయించుకోలేక….తనువులుగా
తడిసి పోతున్న ఆలోచనల చిత్తడి మైదానాల
పరాకాష్టను ఎన్నాళ్ళని ఆరబెడతావు…
ఎన్ని ముఖార విందాలను బింబాలుగా
మలుస్తావు…
ఓర్చకొనే సహన శక్తులున్న ఓదార్చలేని
ధ్యేయంగా వంగిపోతు గమ్యం చివరిదని
ఆ తరువాత క్షణాలు నాశనానికి దారని…
చలించని స్వయం పూజితాలైన
ప్రజ్ఞా పాటవాలు తీరం దాటని కెరటాలుగా
నానుతు…పెగలని గొంతున పాటని మౌనపు
ద్యాసల రెప్పలతో వాల్చుతున్నావు…
అనువంతటి ఆకారానికి అంకురమవుతు
శాశ్వతం బతికించిన క్షణాలు నీకోసమే నని
శ్రమైక జీవన విధానాలలోని మార్పులను
అనుక్షణపు వెలుగుల దివ్వెలుగా వెలిగిస్తు
వేయితలల అన్వేషనని ఆస్థానపు హోదాలు
కలిగిన ప్రాధాన్యతలతో స్వాగతించు…నిత్యం
నీదే అవుతుంది…
– దేరంగుల భైరవ