అధ్బుతమైన సంఘటన
నాకు పెళ్లయ్యాక అత్తగారింట్లో కష్టాలు పడి అడ్జస్ట్ అయే సరికే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు..మా చిన్న మామగారికి నలుగురు కొడుకులు అప్పటికి ఇద్దరు కొడుకుల పెళ్లిల్లు అయ్యాయి వాళ్లి ద్దరికీ ముగ్గురు ముగ్గురు కొడుకులు పుట్టారు..దాంతో మా అత్తగారు ఒకటే పేరు పెట్టడం మీకు ఆడపిల్లలే!మగవాళ్లు పుట్టరు అని తనకు కల కూడా వచ్చిందని అది నిజమవుతుందని రక రకాలుగా బాధ పెట్టేది..
మా అమ్మ వాళ్లేమెా ఆపరేషన్ చేయించుదాం! ఈ కాలంలో ఎవరైతే ఏంటి? అన్నారు ..మా వారు కూడా ఒప్పుకున్నట్టే అనిపించింది..కానీ మా అత్తగారు మళ్లీ గొడవ చేయడం..
కొడుకు పుట్టక పోతే పాలి వాళ్ల ముందు మీకు నల్లముఖం అన్నది
దాంతో మా వారు నాకెందుకు కొడుకు పుట్టడని ఇంకొకరిని కనాల్సిందేనని మెుండి పట్టు పట్టారు నేనేమెా చాలా వీక్! ఇక మా అమ్మ చెప్పినా వినలేదు..ఇక మళ్లీ ప్రెగ్నెన్సీ మాదేమెా చాలా పల్లెటూరు..డెలివరీ వరకూ అక్కడే ఉన్నాక డెలివరీకి పంపించారు..అప్పుడు ఏ స్కానింగ్ లు లేవు మా ఇంటి దగ్గర తిలకం సిస్టర్ దగ్గర డెలివరీ!
నేను సంతోష్ మాతకు సాయిబాబాకు మెుక్కుకున్నా! మా వారేమెా అయ్యప్ప స్వామికి మెుక్కారు ఇక అంతకు మించి చేసేది కూడా ఏమీ లేదు..ఒక గరువారం పెయిన్స్మెుదలయ్యాయి శుక్రవారం అధ్బుతం జరిగింది నా జీవితంలో!
డెలివరీ చేసిన సిస్టర్ ని నేను ఆంటీ అనేదాన్ని ఆ ఆంటీ నన్ను కాసేపు మళ్లీ ఆడపిల్లే అని ఏడిపించినా కాసేపటికి చెప్పింది బాబేనని..ఇక నా ఆనందానికి అవధుల్లేవు నిజంగా అధ్బుతమే అనిపించింది..
నాకు శుక్రవారమే పుట్టడం ఆ దేవత పై కూడా విపరీతమైన నమ్మకం కలిగింది..అన్నట్టు మా బాబు పేరేంటో తెలుసా?సంతోష్ సాయి కుమార్..మా వారు కూడా మాల వేసుకుని శబరిమల వెళ్లొచ్చారు..ఇప్పుడు నేను మా బాబుతోనె ఉంటాను…
ఇది అధ్బుతం కాదంటారా?
మా బాబు పుట్టకపోతే ఇంకా ఎంత మందిని కనిపించేదో! మా అత్తగారు..అప్పుడు నేను ఆవిడను తిట్టుకున్నా ఇప్పటి నా పరిస్థితికి రోజుకోసారి ఆవిడకు దండం పెట్టుకుంటాను..
ఎందుకో మీకర్థం అయే ఉంటుంది కదా!
-ఉమాదేవి ఎర్రం