వింత మనుషులు
నాకు నచ్చిన కథ వింత మనుషులు. దీన్ని రాసిన వారు భవ్యచారు గారు. సమాజంలో ఎంతో మంది మనుషులు ఉంటారు. మనుషుల్లో వేరే వేరే మనస్తత్వాలు కలిగి ఉంటారు.
మనుషులు ఎలాంటి వాళ్లో మనం దాంట్లో ఉన్నామో లేదో కానీ చాలా వివరంగా తెలియజేశారు.
భవ్యచారు గారు బస్సులో వెళుతున్నప్పుడు ప్రతి ఒక్కరిని గమనించేవారంట నాకు ఆ అలవాటు ఉంది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా బయటికి వెళ్ళలేను. నాకు అంతా తెలీదు కూడా.
మనుషుల్ని గమనిస్తాను కానీ నేను ఎలా రాయాలో మాత్రం నాకు తెలియదు. అదొక్కటే నాలో ప్రశ్నార్థం.
నేను కూడా ఇతరులతో తక్కువే మాట్లాడతాను. ఎప్పుడు మాట్లాడను. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతాను.
తర్వాత మౌనమే పాట్టిస్తాను. మనం ఎక్కడికి వెళ్ళినా మనుషులని గమనించడం అలవాటు చేసుకుంటే కథలు రాయొచ్చు అన్నారు. వారు చెప్పింది నిజమే కానీ నాలో అంత ఆలోచించే తెలివి రాలేదు అని నేను అనుకుంటున్నాను.
-మాధవి కాళ్ల