“జ్ఞాపకాల ధాన్యం”
కాలచక్రంలో
ఎగుడుదిగుడులను
అధిగమించే జ్ఞాపకాలు
తీపిరసాల ఆనవాళ్లు
పంపకాలు లేని సంపద కదా
ద్విపద కావ్యంలా రంగులీనుతూ
మునిమాపువేళలో ముసిముసిగా నవ్వుతుంటాయి
కలం హలంతో దున్నేసి
అక్షరాల్ని చెరిగేసి
కవిత్వాన్ని బస్తాల్లోకెక్కిస్తాయి
జ్ఞాపకాల ధాన్యమంటే అదేమరి
-సి.యస్.రాంబాబు