పోరాటం
చేయాలి చేయాలి విప్లవం చేయాలి
ఉన్న వాటిలో తృప్తి చెందకుండా
లేని వాటికోసం ఆరాటపడుతూ
అత్యాశకు పోతూ గాలి మేడలు కడుతూ
డబ్బు కోసం అయిన వారిని దూరం పెడుతూ
డబ్బుని చూసి బంధుత్వం కలుపుకునే వాళ్లని నమ్ముకొని
మంచి అని ముసుగు వేసుకొని అందర్నీ నమ్మిస్తూ
ఉన్నంత స్థాయిలకు ఎదగాలని కుట్ర పడుతూ
అహంకారమే ఆభరణంగా భావిస్తూ
లేని వాళ్ళని చులకనగా చూస్తూ
ఆత్మవిశ్వాసాన్ని ఇతరులు చూసి పోగరుగా భావిస్తూ
అన్నిచోట్ల పోరాటం చేస్తూ
తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకుంది..
తన జీవితంలో ప్రతిరోజు నెత్తురుతో పోరాటం చేస్తూనే ఉంటుంది..
తనకు సహనం ఉన్నంతవరకే అన్ని సహిస్తుంది
ఒక్కసారి ఆ గోడలన్నీ తెంచుకొని విప్లవం సృష్టిస్తుంది..
చేయాలి చేయాలి పోరాటం చేయాలి
తన గమ్యం కోసం పోరాటం చేయాలి
తన ఒంటరితనానికి తోడు అవసరం లేదు అని పోరాటం చేయాలి
తనకంటూ ఒక స్థాయిని ఏర్పాటు చేసుకోవాలి
మండే గుండెల్లో రగులుతున్న అగ్నిజ్వాలలా
భగభగ మండుతున్న నిప్పుల్లో తను కాలి బూడిదైపోతుంది..
కన్నీళ్లు తుడుచుకుంటూ తానే ధైర్యం అంటూ ముందుకు నడవాలి..
తన శక్తి తానే తెలుసుకోలేని అమాయకురాలు
బతుకు బాగుపడాలని ఆరాటపడుతూ
అందర్నీ గుడ్డిగా నమ్మకుండా తన పైన తనకు నమ్మకం ఏర్పరచుకుంది…
ఆలుపెరుగని శ్రమను గుర్తిస్తూ
తనతో స్నేహభావంతో ఉండాలి..
స్త్రీ ఔన్నత్యాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు…
-మాధవి కాళ్ళ