దేశం కోసం
మన దేశం కోసం..
ఎంతో మంది విప్లవ కారులు..
విప్లవం రేకెత్తించి తెల్ల దొరల..
బారి నుండి మనల్ని రక్షించారు..
భగత్ సింగ్,సుభాష్ చంద్రబోస్ లాంటి అనేక మంది వీరుల పోరాటమే మన స్వతంత్రం..
మన దేశం మనకు వచ్చింది..
మన భారత దేశం మనదని గర్వంగా చెప్పుకుంటున్నాం! ఇవ్వాల్ల..
ఎంతో మంది ప్రాణాలనర్పించి
మనకీ దేశాన్నిచ్చారు..
అలాంటి దేశంలో కుళ్లు,కుతంత్రాలు ఎక్కువై పోతున్నాయి..
స్వాతంత్రం వచ్చిన సంతోషాన్ని మిగల నీయకుండా నేడు దర్మార్గులు ఎక్కువవుతున్నారు..
భరత మాత భరించ లేనంటుంది..
భారతావని మూగబోతుంది..
భారతమ్మను కాపాడుకుందాం!
కలిసి మెలిసి ఉండి భారతమ్మను..
సంతోష పెడదాం!!
-ఉమాదేవి ఎర్రం