హరిత విప్లవం
భూమికి సాగునీరు అందిస్తూ,
సరైన ఎరువులను వాడుతూ,
యాంత్రీకరణ ప్రవేశపెడుతూ,
అధిక దిగుబడి సాధించేందుకు రైతులు చేసే వ్యవసాయమే ఈ హరిత విప్లవం.
హరిత విప్లవం వచ్చేస్తే
పంట దిగుబడి పెరిగేను.
రైతుల ఆశలన్నీ తీరేను.
వారు ఆర్ధికంగా ఎదిగేరు.
దేశము అభివృద్ధి చెందేను.
బహుళ పంటలు వేయాలి.
మేలైన వంగడాలను వాడాలి.
నాణ్యమైన ఎరువులు వాడాలి.
నిశ్చలమైన సాగునీరు ఇవ్వాలి
యంత్రాలను సరిగ్గా వాడాలి.
అప్పుడే హరిత విప్లవం సాధ్యం.
-వెంకట భానుప్రసాద్ చలసాని