గోదావరి
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఈ సినిమాలో చాలా భాగం గోదావరి నది, పాపికొండల ప్రాంతంలో జరుగుతుంది.. భద్రాచలం వెళ్ళడానికి పడవలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెళ్ళడం నాకు చాలా నచ్చింది. నాకు కూడా అలా పడవలో వెళ్ళడం చాలా ఇష్టం..
సందర్భం బట్టి పాటలు ఉండడం చాలా చాలా బాగుంటాయి.. ఈ సినిమాలో హీరో మరదలు కి కొంచెం అహంకారంగా ఉంటుంది. బావ తనని ప్రేమిస్తున్నాడు అని తెలిసిన వేరే అతనితో పెళ్లికి ఒప్పుకుంటుంది. తన ఇష్టాలు కాదన్నాడని తన బావని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోమని చెప్పింది అది చూసి హీరోయిన్ తప్పుగా అర్థం చేసుకుంటుంది హీరోని.
తర్వాత హీరోయిన్ డైరీ దొరకడం హీరో చదివి వాళ్ళ ఇంటికి వెళ్లడం అదే లాస్ట్ ఎండింగ్. ఈ సినిమా నాపై ఎంతో ప్రభావం చూపింది. ఇప్పటికీ అయితే ఎన్నో సార్లు చూసాను. అంత ఇష్టం. అసలు మాటలు రావడం లేదు. ఆ అనుభూతి అనుభవిస్తే గాని తెలీదు. నేను ఆ సినిమా చూసిన ప్రతిసారి కొత్త అనుభూతికి లోనయ్యేదాన్ని…
– మాధవి కాళ్ళ