వలయం
పాల నురగమబ్బులా ప్రవహించే జీవితం
కోరుకోనిదెవ్వరు
నీటి బుడగలాంటిది జీవితమని తెలుసుకోరెవ్వరు
కోరికలు బుసకొడుతుంటాయి
బాధలు చుట్టేస్తుంటాయి
బంధాలు బాధ్యతలు భయపెడుతుంటాయి
జీవితమంటేనే విచిత్ర వలయం
వలపులు, తలపులు,వేల్పులు
అన్నీ స్వీకరించాల్సిందే
అప్పుడే పాలనురగ మబ్బైనా వానచినుకైనా దరిచేరి దరహాసాన్ని పంచేది
అసంతృప్తిని తుడిచేసేది
-సి.యస్.రాంబాబు