హీరో

హీరో

హీరోల్లో నాకు నచ్చిన హీరో అంటే రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన మంచి నటుడు.ఎలాంటి సన్నివేశం లో అయినా ఒదిగిపోయే నటుడు అతను. అతని కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన అన్ని సినిమాలు దాదాపు చూస్తాను.కామెడీ సినిమాలు అంటే ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి కాసేపు అయినా నవ్వుకోవచ్చు కదా అందుకే నాకు కామెడీ అంటే ఇష్టం.

వారి సినిమాల్లో మంచి కామెడీ ఉండేది.ఇప్పుడు వస్తున్న కామెడీ అంతగా నచ్చడం లేదు. ఆరోగ్య పరమైన ,ఆలోచించే విధమైన కామెడీ ఇప్పుడు రావడం లేదు. అసలు కామెడీ చేస్తుంటే ఇధి కామెడీ నా అనే ఆశ్చర్యం వేస్తుంది. అలా ఏడిపిస్తుంది ఇప్పటి కామెడీ. అసలు నవ్వించడం అంటే ఎంతో కష్టం , అయ్యో హీరో గురించి చెప్పకుండా కామెడీ గురించి చెప్తున్నా… సరే ఇక హీరో గురించి మాట్లాడుకుందాం.

రాజేంద్ర ప్రసాద్ గారు పాత సినిమాలలో సైడ్ క్యారెక్టర్ లు బాగా చేశారు. పెద్ద హీరో లకు తమ్ముడిగా , కొడుకుగా చేసి మెప్పించారు. ఆ పాత సినిమాలలో తన పాత్రకు తగ్గ న్యాయం చేసేవారు. నలుగురు ఉన్న ఇంట్లో భార్య తిడుతున్నా నిగ్రహంగా ఉండే పాత్ర ,సినిమా పేరు గుర్తుకు లేదు. అలాగే సంసారం ఒక చదరంగం సినిమాలో శరత్ బాబు కి తమ్ముడి గా ఆయన నటన చెప్పుకో దగ్గది.

ఇక జోకర్ , మయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, లాంటి s.v. కృష్ణారెడ్డి గారి దాదాపు అన్ని సినిమాల్లో ఆయనే హీరో. మంచి ఆరోగ్య కరమైన హాస్యాన్ని అందించారు ఆ  త్రిత్రయం. అచ్చిరెడ్డి,s.v కృష్ణారెడ్డి,రాజేంద్ర ప్రసాద్ అంటే చాలు ఆ సినిమా సూపర్ హిట్టు అని ,

అలాగని రాజేంద్ర ప్రసాద్ గారు మొత్తం కామెడీ హీరో ఇమేజ్ నుండి ఆ నలుగురు , మీ శ్రేయోభిలాషి సినిమాల ద్వారా తనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు.అలరించారు. ఆలోచించేలా సందేశం ఉన్న సినిమాలలో కూడా నటిస్తూ తన నటనకు కొత్త మెరుగులు దిద్దుకుంటూ ఇంకెన్నో సినిమాలలో నటించి మనల్ని అలరించాలని కోరుకుంటున్నాను.

ఆయన నవ్వడం ఒక యోగం,నవ్వించడం ఒక భోగం , నవ్వక పోవడం ఒక రోగం అంటూ నిరూపించిన గొప్ప వ్యక్తి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. మీరు ఎప్పుడైనా విషాదం లో ఉంటే వారి సినిమా చూడండి అన్ని మర్చిపోయి హాయిగా ప్రశాంతంగా నవ్వుతారు..

-భవ్యచారు

 

0 Replies to “హీరో”

  1. ఒక గొప్ప నటుడి గురించి చక్కగా వ్రాసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *