ఆడవారి ఆరోగ్యం

ఆడవారి ఆరోగ్యం

చాలామంది ఆడవాళ్లు తమకు ఏ అనారోగ్యం వచ్చినా బయటకి చెప్పుకోరు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ అవుతాయనే  భయం కావచ్చు, లేదా తమ ఇంటి పరిస్థితి బాగాలేదు అని కావచ్చు. అందువల్ల చాలా మంది తమ గురించి తాము సరిగా పట్టించుకోరు.

చిన్నచిన్న వాటికి డాక్టర్ దగ్గరికి ఎందుకులే అని అనుకుంటూ గృహ వైద్యం పాటిస్తూ ఉంటారు. అంటే పసుపు నీళ్లు కానీ, లేదా మరొకటి కానీ చేస్తూ ఉంటారు .తప్ప , ఇంట్లో  వాళ్లకు విషయం చెప్పరు. 

మరికొందరు చెప్పినా కూడా ఆ ఏముందిలే ఇంత పసుపు పూసుకోపోతుంది అని అంటూ నిర్లక్ష్యం చేస్తారు. అయితే ఈ చిన్న, చిన్న వ్యాధులు మామూలుగా తగ్గిపోయినా,  కొన్ని మాత్రం పెద్ద ప్రమాదానికి దారితీస్తూ ఉంటాయి. దాన్ని చివరి వరకు ఎవరు గుర్తించరు.

ఇప్పుడు అసలు సమస్యకు వద్దాం.. పూర్వకాలంలో బయట అంటే పీరియడ్స్ సమయంలో ప్రత్యేకంగా బయట కూర్చో పెట్టేవారు. ఎందుకంటే ఆ సమయంలో వారికి కోపం, చిరాకు ఉంటాయి. అలాగే మరికొందరికి కడుపునొప్పితో బాధపడుతూ ఉంటారు. అందువల్లే పెద్దవాళ్లు స్త్రీలకు పని నుండి  విముక్తి ఇచ్చి,  ఆ నాలుగు రోజులు రెస్ట్ అనేది ఇచ్చేవారు.

దాన్ని కొందరు ఇప్పటికీ పాటిస్తున్న కూడా మరికొందరు కలుపుకొని పోతున్నారు .ఎందుకంటే ఇప్పుడు అలా కూర్చుంటే పనులు జరగవు కాబట్టి. ఇప్పటికాలంలో మహిళలు కూడా పనిచేస్తే తప్ప చాలా కుటుంబాల్లో ఈ ఆచారాన్ని పక్కన  పెట్టి కలుపుకొని పోతూ మామూలుగా పనులు చేసుకుంటున్నారు.

ఇది చాలా తప్పు, ఎందుకంటే ఆ సమయంలో స్త్రీలు చాలా చిరాకుగా, చాలా ఇబ్బందిగా ఉంటారు. తమకేం అవుతుందో  కూడా తెలియని స్థితిలో ఉంటూ అర్థం లేని మాటలు మాట్లాడుతారు. ఆ సమయం లో  తప్పులు చేస్తుంటారు. అలాగే బ్లీడింగ్ అవ్వడం వల్ల తమ శక్తిని కోల్పోతూ ఉంటారు.

అందువల్ల నీరసం, నిస్సహాయత కలగలిపిన సమయంలో, ఒక్కొక్కసారి విచక్షణను కోల్పోయి, తానేం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో, తమ ఉద్యోగాలను కూడా పోగొట్టుకుంటూ ఉంటారు.

ఆ క్షణంలో స్త్రీ బలహీనురాలు అవుతుంది. ఆలోచించే శక్తిని, జ్ఞానాన్ని, కోల్పోతుంది. విధి లేని పరిస్థితిలో పనికి వస్తుంది తప్ప తనకు చేతనే కాదు. ఇలాంటి సమయాల్లో జరిగే గొడవల వల్ల చాలా కుటుంబాలు నష్టపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

అందుకే స్త్రీ మనసుని అర్థం చేసుకోండి. ఆచారం పాటించకపోయినా పర్వాలేదు. కానీ తన మనసును అర్థం చేసుకుంటు సహాయం చేసి ఆమెకు తగినంత రెస్టు ఇవ్వాలి. నిజానికి మన పెద్దలు పూర్వకాలంలో ఇవన్నీ ఆలోచించే ఆమెను అలా దూరంగా ఉంచాలని సాంప్రదాయాన్ని తీసుకువచ్చారు.

కానీ కొందరు మూర్ఖులు కావాలని మమ్మల్ని అణచివేస్తున్నారు అంటూ దీనికి ఎదురు కూడా పోరాడుతున్నారు. ఒకసారి మీరే ఆలోచించండి ,ఒకవైపు కారిపోతుంటే మరోవైపు ఇంట్లో పనులు బయట పనులు వల్ల ఎంత నీరస పడతారు ఆడవాళ్లు అనేది మీ అక్క చెల్లెలు చూసి తెలుసుకోండి.

ఈమధ్య ఆడవాళ్లు కూడా అలాగే చేస్తున్నారు. కానీ ఇది చాలా తప్పు. అది ముందు ముందు ప్రమాదాలకు దారి తీయవచ్చు.  హార్మోన్స్ లోపం జరిగి పిల్లలు పుట్టకుండా అవ్వచ్చు .లేదా బరువు పెరగవచ్చు, లేదా డయాబెటిక్  ఇంకేదైనా వ్యాధి  రావచ్చు.

ఏ అంచున ఏం ప్రమాదం దాగి ఉందో చెప్పలేము. కాబట్టి స్త్రీలు వారి ఆరోగ్యం  వారే రక్షించుకోవాల్సి ఉంటుంది. రేపు ఏదైనా పెద్ద ప్రమాదం లేదా వ్యాధి వస్తే దానికి బాధ్యులు మీరే అవుతారు కదా.

ఇప్పుడు కొద్దిగా కంపెనీలు, కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కాని మెన్షన్స్ లీవ్ ఇస్తున్నాయి. కానీ అది మన దగ్గర వరకు రాలేదు. వచ్చిన ఇక్కడ వాళ్ళు దానిని పట్టించుకోవడం లేదు అనేది నిజం. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కనీసం ఆ ఐదు రోజులు కాకపోయినా ,మూడు రోజులైనా రెస్టు తీసుకోండి.

ఆ ఇంట్లోనే ఉన్నాం కదా పనులు చేద్దాం అని ఇంటిని సర్ది పెట్టడం లాంటివి చేయకుండా, మీ ఆరోగ్యాన్ని మీరే రక్షించుకోవాల్సి ఉంటుంది.లేదంటే మీరు మీ కుటుంబానికి దూరం అయ్యే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సకులారా ఒక్కసారైనా ఆలోచించండి.

మీ గురించి మీరు ఆలోచించుకోండి .కాసేపు మీ కుటుంబాన్ని పక్కన పెట్టండి. నేను ఈ సమయంలో రెస్ట్ తీసుకుంటున్నాను అనేది మీ వాళ్లకి తెలిసేలా చేయండి.

ఆ మూడు రోజులు ఇంటి పనులు కానీ, బయటి పనులు  కానీ చేయకుండా, సంతోషంగా ఉంటూ, మీకు నచ్చిన పనులు అంటే కూర్చొని చేసే పనులు కుట్లు ,అల్లికలు లాంటివి చేసుకోవచ్చు. అలాగనీ  మళ్ళి  మిషన్ తొక్కమని చెప్పడం లేదు. మిషన్ తొక్కితే దానివల్ల కూడా అనారోగ్యం పాలు అవుతారు. 

ఈ బాధ దేవతలకే తప్పలేదు, మనమెంత కాని మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది కాబట్టి మనమే మనల్ని రక్షించుకోవాలి.

ఇంకా పచ్చిగా చెప్పవచ్చు ,కానీ ఇంతటితో ఆపేస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారు అనే ఆశతో.

 

మీ భవ్య చారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *