వింత లోకం
మన చుట్టూ ఉన్నది చాలా వింత ప్రపంచం. ఈ వింత ప్రపంచంలో అనేక మంది వింత మనుషులు ఉన్నారు. అందులో మణి ఒకరు. మణి బాగా చదువుకున్నవాడైనా గానీ మూఢ విశ్వాసాలు బలంగా నమ్మేవాడు.ఉదయం నల్లపిల్లి ఎదురు వస్తే అశుభం జరుగుతుందని నమ్మేవాడు.
అలాగే మంగళవారం నాడు ఏ పని మొదలు పెట్టకూడదుఅని అతని మూఢ నమ్మకం. మంగళవారం నాడు ఆర్థికలావాదేవీలు పక్కన పెట్టేవాడు. నల్లపిల్లికి అశుభానికిఏమి సంబంధం ఉందో అతనికితెలీదు. పెద్దలు చెప్పారు కాబట్టి గుడ్డిగా ఆచరించేవాడు.
సైన్సు గ్రాడ్యుయేట్ అయినప్పటికీ ఇలా మూఢనమ్మకాలు,జాతకాలు,ముహూర్తాలు పిచ్చిగానమ్మేవాడు. అతని మితృలుఅతని వింత ప్రవర్తనకు చాలానవ్వుకునేవారు. ఎవరైనాతుమ్మినా కొంత సమయంఆగి బయలుదేరి వెళ్ళేవాడు.
అలాగే ముహూర్తం చూసుకునిబయలుదేరి వెళ్ళేవాడు. ఏదైనా పని మొదలుపెట్టినా ముహూర్తం చూసుకుని బయలుదేరి వెళ్ళాడు. అందుకే చాలా సార్లు ఆఫీసుకులేటుగా వెళ్ళేవాడు. అతనిచాదస్తం చూసి అతని సహోద్యోగులు, మేనేజ్మెంట్కూడా నవ్వుకునేవారు.
సైన్సుగ్రాడ్యుయేట్ అయ్యి కూడాఅతను ఇలా వింతగా ప్రవర్తించటం అందరికీ చాలాచిత్రంగా ఉండేది. యదార్ధంపక్కన పెట్టి మూఢనమ్మకాలునమ్మిన మణికి జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తగిలేవి.
అప్పుడు అతనిమితృడు”నువ్వు గుడ్డిగాజాతకాలు,ముహూర్తాలునమ్ముతావు కానీ చాలా
సార్లు నీకు నష్టం జరుగుతోంది.
నిజంగా ముహూర్త బలంఉంటే నీకు అన్నీ సక్రమంగాజరగాలి. అలా జరగడం లేదు.నీకు పనులు జరగకపోవడంనీ జాతకం సరిగ్గా లేకపోవడంవల్ల కాదు. దానికి అనేకవాస్తవిక కారణాలు ఉంటాయి.
అందుకే నువ్వు మూఢనమ్మకాలు వదిలివాస్తవిక జీవితం గడపటంనేర్చుకో. కష్టపడి పనిచేస్తేఏదైనా సాధించవచ్చు”అనిఅన్నాడు. అప్పుడు మణితన వింత ప్రవర్తన కారణంగాఎంత నష్టపోతున్నాడో గుర్తించాడు.
అప్పటినుండివాస్తవిక ప్రపంచంలో జీవించేవాడు. మణి లాంటివింత మనుషులు రకరకాలవింత పనులు చేస్తూ తమకుతాము నష్టపోతూ ఇతరులకు కూడా నష్టం కలిగిస్తున్నారు. అలాంటి వారు తప్పనిసరిగామారాలి.
-వెంకట భానుప్రసాద్ చలసాని