అన్నంటే
అమ్మలో సగం(అ),నాన్నలో సగం(న్న) కలిస్తేనే అన్నయ్య.
అన్నలకే బాధ్యతలు ఎక్కువ.
చిట్టి చెల్లెమ్మను ఆడించాలి.
తమ్ముణ్ణి సముదాయించాలి.
తల్లిదండ్రుల మాటలు వినాలి.
వినటమే కాదు ఆచరించాలి.
అలా చేసే అన్నని ప్రేమించాలి.
అన్న నిజంగా పరమశివుడే.
కొంత ప్రేమకే కరిగిపోతాడు.
పనులన్నీ భుజంపై మోస్తాడు.
అక్క చెల్లెమ్మల మేలు కోసం
జీవితాన్నే త్యాగం చేస్తాడు.
వారి కళ్ళలో ఆనందాన్ని
చూసేందుకు గరళం కూడా
తాగేసే అన్న నిజంగా శివుడే.
-వెంకట భానుప్రసాద్ చలసాని
అన్న అంటేనే ప్రేమ స్వరూపం.