కీర్తిశేషులు
ఎందరో మహానుభావులు
చరిత్రలో కీర్తిని పొందారు.
వారందరికీ వందనములు.
అహింస నేర్పెను మన గాంధీజీ.
శాంతి ప్రియుడు మన చాచాజీ.
పోరాట స్ఫూర్తి ఇచ్చిన నేతాజీ.
వీరంతా చరిత్ర తిరగ వ్రాసారు.
దేశభక్తి చూపెను మన శివాజీ
ప్రేరణ ఇచ్చెను మన ఝాన్సీ రాణి చరిత్ర.
పోరాటం నేర్పెను మన అల్లూరి
సీతారామ రాజు.
వీరే కదా చరిత్రలో నిలిచిన వీరులు.
వీరే కదా కీర్తి శేషులు
తమ కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన వీరంతా
చరిత్రలో నిలిచిపోయారు.
-వెంకట భానుప్రసాద్ చలసాని
అమర వీరులకు జోహార్లు.