జాగ్రత్త
మనిషీ ఎండిపోతాడు
మొక్కా ఎండిపోతుంది
మొక్క వెంటనే చిగురిస్తుంది
మనిషి అరుదుగా చిగురిస్తాడు
మొక్కకు ఇవ్వటమే తెలుసు
మనిషికి ఇవ్వటం తెలిసినా
తీసుకోవటమే ముఖ్యమంటాడు
అదీ నా తెలివంటాడు
మాట తెలిసినవాడిని
మనసున్నవాడిననుకుంటాడు
ఇవేవీ లేని మొక్కదో సువాసన
మనిషిది మాత్రం నరవాసన
తస్మాత్ జాగ్రత్త
-సి.యస్.రాంబాబు