మనసా కవ్వించకే
యువత మనసే
ఒక తెల్లకాగితం.
యువత మనసు
అతి సున్నితం.
శారీరక అందాన్ని చూసి
ఆకర్షణలో పడిపోతారు.
అది ప్రేమగా భ్రమిస్తారు.
మనసు కవ్విస్తుంటే
లొంగిపోయేది యువతే.
లొంగిపోయిన యువతకు
విచక్షణ అనేది ఉండదు.
విచక్షణ లేని యువత
తప్పటడుగులు వేస్తారు.
తప్పటడుగులు వేసిన
వారిని సరిదిద్దేది దోస్తులే.
మంచి దోస్తులుంటే
మంచే జరుగుతుంది.
దోస్తులు చెడ్డవారైతే
ఇబ్బందుల పాలు అవుతారు.
-వెంకట భానుప్రసాద్ చలసాని